Air Arabia: భారత్‌లోని ఆ నగరానికి కొత్త సర్వీస్.. వారానికి 3సార్లు.. ఎప్పట్నుంచంటే..
ABN, First Publish Date - 2023-02-12T11:41:50+05:30
యూఏఈ రాజధాని అబుదాబి (Abu Dhabi) నుంచి భారత్‌లోని కోల్‌కతా నగరానికి (Kolkata City) ఎయిర్ అరేబియా ఎయిర్‌లైన్స్ (Air Arabia Airlines) కొత్త సర్వీస్‌ను ప్రకటించింది.
అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబి (Abu Dhabi) నుంచి భారత్‌లోని కోల్‌కతా నగరానికి (Kolkata City) ఎయిర్ అరేబియా ఎయిర్‌లైన్స్ (Air Arabia Airlines) కొత్త సర్వీస్‌ను ప్రకటించింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కోల్‌కతా ఇంటర్నెషనల్ ఎయిర్‌పోర్టుకు (Kolkata International Airport) వారానికి మూడుసార్లు ఈ సర్వీస్ ఉంటుంది. మార్చి 15వ తేదీ నుంచి సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా తాజాగా వెల్లడించింది. సోమ, బుధ, శనివారం సర్వీస్ నడిపించనుంది. ఈ మూడు రోజులు అబుదాబి విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు(యూఏఈ కాలమానం ప్రకారం) విమానం బయల్దేరుతుంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో రాత్రి 8.20 గంటలకు ల్యాండ్ అవుతుంది. తిరిగి కోల్‌కతా నుంచి రాత్రి 9.05 గంటలకు బయల్దేరి, తెల్లవారుజామున 1.05 గంటలకు అబుదాబి ఎయిర్‌పోర్టుకు (Abu Dhabi International Airport) చేరుకుంటుంది. దీనికోసం ఎయిర్ బస్ ఏ320ను వినియోగించనున్నట్లు ఎయిర్ అరేబియా సీఈఓ అదేల్ అల్ అలీ వెల్లడించారు.
కాగా, భారత ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలోనే కోల్‌కతా నుంచి ఈ కొత్త సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాక ఈ కొత్త సర్వీస్ రెండు దేశాల మధ్య వ్యాపారం, సాంస్కృతిక మార్పిడితో పాటు కస్టమర్ బేస్‌ను పెంచుకోవడానికి కూడా సహాయపడుతుందని తెలిపారు. ఇక ఎయిర్ అరేబియా అబుదాబి అనేది లోకాస్ట్ క్యారియర్ అనే విషయం తెలిసిందే. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా మొత్తం 28 గమ్యస్థానాలకు విమాన సర్వీసులు నడిపిస్తుంది. ఇప్పటికే భారత్‌లోని (India) కొచ్చి, కోజికోడ్, తిరువనంతపురం, చెన్నై, ముంబై, అహ్మదాబాద్‌కు విమానాలు నడుపుతోంది. ఇప్పుడు ఇండియాలో ఏడవ గమ్యస్థానంగా కోల్‌కతాను ఎంచుకుంది. అబుదాబి నుంచి కోల్‌కతా వెళ్లాలనుకునే ప్రయాణికులు ఎయిర్ అరేబియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ (Online Ticket Booking) చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..
Updated Date - 2023-02-12T11:41:51+05:30 IST