ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Airfares: ఈ రంజాన్‌కు యూఏఈ నుంచి భారత్‌కు వచ్చే ఆలోచనలో ఉన్నారా..? అయితే మీ జేబుకు చిల్లే..!

ABN, First Publish Date - 2023-02-28T11:07:05+05:30

ఈసారి రంజాన్ పండుగ (Ramzan Festival) సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నుంచి స్వదేశానికి వచ్చే ఆలోచనలో ఉన్న భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: ఈసారి రంజాన్ పండుగ (Ramzan Festival) సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నుంచి స్వదేశానికి వచ్చే ఆలోచనలో ఉన్న భారతీయులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పండుగ సీజన్‌లో యూఏఈ నుంచి భారత్‌కు విమాన టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఏకంగా 10 నుంచి 25 శాతం మేర పెరుగుదల ఉంటుందని అక్కడి స్థానిక మీడియా ద్వారా తెలిసింది. మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసం నుంచి విమాన ఛార్జీల పెరుగుదల నెమ్మదిగా మొదలవుతుందని స్థానిక మీడియా పేర్కొంది. పండుగ దగ్గర పడేకొద్ది ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి.

ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 21 నుండి 30 వరకు యూఏఈ (UAE) నుండి భారత్‌కు ఒక రౌండ్ ట్రిప్‌కు ఎకానమీ విమాన టికెట్ ధర సుమారు 1,316 దిర్హామ్స్ (రూ. 29,710) ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన నష్టాలను రికవరీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ఈ పండుగ సీజన్‌ను ఉపయోగించుకుని ధరలు పెంచేందుకు రెడీ అవుతున్నాయట. అలాగే వేసవి ప్రారంభానికి ముందు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే చివరి నెల కాబట్టి మార్చి, ఏప్రిల్‌లలో ఈ సమయంలో ఇన్‌బౌండ్ ట్రావెల్ డిమాండ్ అత్యధికంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: డాక్టర్ మజ్హర్ అలీ ఖాన్ ఆత్మహత్య.. ఈయన బ్యాక్‌ గ్రౌండ్ తెలుసా?.. ఏకంగా ఒమన్ రాజుతో..


ఇక ఈ రంజాన్ మాసంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెలవులు ఇస్తారు. దీంతో చాలా మంది భారతీయులు ఇండియాకు వస్తారు. ముఖ్యంగా ఈ రంజాన్ ముస్లింలకు చాలా పెద్ద పండుగ కాబట్టి వారు తప్పని సారిగా ఇండియాకు వస్తారు. ఇలా వచ్చే వారికి ఈసారి ఖర్చు కాస్త ఎక్కువ కానుంది. కాగా, గత రెండేళ్లుగా మహమ్మారి కరోనా కారణంగా నెమ్మదించిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇదే అదునుగా విమానయాన సంస్థలు ఛాన్స్ దొరికిన ప్రతిసారి చార్జీలు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి.

ఇది కూడా చదవండి: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

Updated Date - 2023-02-28T11:07:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!