ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Airfares: యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్.. లేకుంటే మీ జేబుకు చిల్లే..!

ABN, First Publish Date - 2023-04-04T08:37:53+05:30

యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం బెటర్. ఎందుకంటే యూఏఈ-ఇండియా మార్గాల్లో విమాన ఛార్జీలు (Airfares) భారీగా పెరగనున్నాయి. గత నెలలో రద్దీగా ఉండే రూట్‌లో భారత జాతీయ క్యారియర్లు వరుసగా విమానాలను రద్దు చేశాయి. దీని ప్రభావంతో విమాన ఛార్జీలు క్రమంగా గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక రాబోయే నెలల్లో విమాన టికెట్ల ధరలు సుమారు 300 శాతం మేర పెరిగే అవకాశాం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. ఎయిర్‌లైన్స్ అన్నీ చిన్న విమానాలను బిజీ రూట్లలో వేశాయని, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేసిందంటున్నారు. తద్వారా విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయని వారు తెలిపారు. గత నెల 25వ తేదీ నుంచి ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్.. ఇండోర్, కోజికోడ్, గోవాతో పాటు యూఏఈ నుంచి వివిధ నగరాలకు విమానాలను రద్దు చేయడం ప్రారంభించింది. కొత్త విమానాల కొనుగోలు, విమానాల అప్‌గ్రేడ్ పేరిట భారతీయ క్యారియర్లు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాయి.

డెయిరా ట్రావెల్స్ జనరల్ మేనేజర్ టీపీ సుధీష్ మాట్లాడుతూ.. విమానాలను రద్దు చేయడం, చిన్న విమానాలను మోహరించాలనే నిర్ణయం అధిక విమాన ఛార్జీల రూపంలో ప్రయాణికులపై ప్రతికూలంగా ప్రభావం చూపిందని పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రమైన కేరళ వైపు ప్రభావం చూపుతుందని తెలిపారు. దుబాయి, షార్జా నుంచి కాలికట్‌కు విమానాలను ఉపసంహరించుకున్నారు. దాంతో ప్రయాణికుల సీట్ల సంఖ్య తగ్గడంతో ప్రయాణ ఖర్చు విపరీతంగా పెరిగిందని చెప్పుకొచ్చారు. కొచ్చిన్ రూట్‌పై కూడా తీవ్ర ప్రభావం పడిందన్నారు. తక్కువ సీజనల్ ధరలతో పోలిస్తే సాధారణంగా వేసవిలో విమాన ఛార్జీలు 100 నుంచి 300 శాతం మధ్య పెరుగుతాయని ఆయన చెప్పారు.

UAE jobs: డొమెస్టిక్ వర్కర్లకు కొత్త శాలరీ రూల్.. ఇకపై యజమానులు తప్పనిసరిగా..!


ఇదిలాఉంటే.. ఎమిరేట్స్‌లో భారీ సంఖ్యలో భారతీయులు ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో యూఏఈ-ఇండియా మార్గం (UAE-India travel) అత్యంత రద్దీగా ఉండే కారిడార్‌లలో ఒకటి. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎయిర్ అరేబియా అబుదాబి-కోల్‌కతా మార్గంలో డైరెక్ట్ సర్వీస్‌ను ప్రారంభించింది. అలాగే ఎతిహాద్ ఎయిర్‌వేస్ కూడా కోల్‌కతాకు రోజువారీ సర్వీసును తిరిగి ప్రారంభించింది. ఇక ఇండిగో ఎయిర్‌లైన్స్ కూడా మార్చి ప్రారంభంలో షార్జా-భువనేశ్వర్ రూట్‌లో సర్వీస్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

UK: స్వదేశంలోనే కాదు.. విదేశాలకు వెళ్లిన మనోళ్లది అదే పంథా.. పేరెంట్స్‌పై వేధింపులతో కటకటాలపాలైన ఎన్నారై!


ఇక 'రంజాన్ ఇన్ దుబాయి' ప్రచారం విస్తృతం చేయడంతో రంజాన్ సమయంలో భారత్ నుంచి చాలామంది పర్యాటకులు వస్తున్నారని, వచ్చే నెల నుంచి భారత్, యూఏఈలలో పాఠశాలలకు సెలవులు ఉండడంతో విమాన ఛార్జీలు 25శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు ఏజెంట్లు చెబుతున్నారు. దాంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ఇతర పెద్ద నగరాలకు జూలైలో ఛార్జీలు దాదాపు 1500-1800 దిర్హమ్స్ (రూ.33,549 నుంచి రూ. 40,259) మధ్య ఉండనున్నాయి. టికెట్ ముందే బుక్ చేసుకుంటే జూలైలో 2500 దిర్హమ్స్‌కు (రూ.55,915) చేరుకుంటుంది. ఇక బుక్ చేసుకోకపోతే 3వేల దిర్హమ్స్‌కు (రూ.67,130) తాకే అవకాశం ఉంది.

Georgia on Hinduphobia: హిందువులకు జైకొట్టిన తొలి అమెరికా రాష్ట్రం.. శాంతి కోసం హిందుత్వం పాటుపడుతోందని ప్రశంస


Updated Date - 2023-04-04T08:37:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising