ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అందంగా కనిపించాలని ముక్కుకు సర్జరీ.. ఆ తర్వాత గంటల్లోనే షాకింగ్ ఘటన..

ABN, First Publish Date - 2023-02-09T11:48:48+05:30

అందంగా కనిపించాలని అమెరికాకు చెందిన 21ఏళ్ల ఓ యువతి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ (Nose Surgery) చేయించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్ ఫ్రాన్సిస్కో: అందంగా కనిపించాలని అమెరికాకు చెందిన 21ఏళ్ల ఓ యువతి ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ (Nose Surgery) చేయించుకుంది. అలా ఆమెకు ఆపరేషన్ జరిగిన గంటల వ్యవధిలోనే షాకింగ్ ఘటన జరిగింది. ఇంటికి వచ్చిన గంటల్లోనే శ్వాస తీసుకోలేక తీవ్రంగా ఇబ్బంది పడింది. దాంతో కుటుంబ సభ్యులు హూటాహూటిన ఆమెను సర్జరీ చేసిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతే.. అక్కడ డాక్టర్లు చెప్పింది విని షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శాన్ ఫ్రాన్సిస్కోలో (San Francisco) ఉండే 21ఏళ్ల జులియెత్ కార్డెనాస్ యురిబె (Karen Julieth Cardenas Uribe) సైకాలజీ కోర్సు చదువుతోంది. మరింత అందంగా కనిపించాలని ముక్కు ఆకృతి మార్చుకోవాలనుకుంది. జనవరి 29న ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునేందుకు క్లినిక్‌కు వెళ్లింది. వైద్యులు దాదాపు ఆరున్నర గంటలు శ్రమించి జులియెత్ ముక్కు ఆపరేషన్ సక్సెస్ చేశారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించేశారు.

కానీ, ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే సర్జరీ నిర్వహించిన క్లినిక్ వైద్యులను సంప్రదించారు. దాంతో డాక్టర్లు ఆమెను క్లినిక్‌కు తీసుకురావాల్సిందిగా చెప్పారు. వెంటనే జులియెత్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు షాకయ్యారు. అప్పటికే ఆమె ఊపిరితిత్తులు రెండు కూడా పూర్తిగా రక్తంతో నిండిపోయి ఉన్నాయి. శ్వాస పూర్తిగా ఆగిపోవడంతో ఆమె స్పృహాలో కూడా లేదు. దాంతో జులియెత్‌ను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆరుసార్లు కార్డియెక్ రెస్పిరేటరీ అరెస్టులతో యువతి ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే, సర్జరీ చేసిన వైద్యుడి తప్పిదం వల్లే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: రూ. 32 వేల కోట్లు కొట్టేసిన లేడీ కిలాడీ.. ఐదేళ్లుగా ఎఫ్‌బీఐ వేట.. ఇప్పుడు ఎక్కడ ?

Updated Date - 2023-02-09T11:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising