ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

US Shocker: అమెరికాలో 'అమ్మా'నుషం.. పసికందును చంపేసి.. ఏమీ ఎరగనట్టు అంత్యక్రియల కోసం చందాలు వసూలు చేసిన తల్లి.. చివరికి

ABN, First Publish Date - 2023-11-12T12:52:49+05:30

అగ్రరాజ్యం అమెరికా (America) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల పసివాడిని కన్నతల్లే చిదిమేసింది.

US Shocker: అగ్రరాజ్యం అమెరికా (America) లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడు నెలల పసివాడిని కన్నతల్లే చిదిమేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అంత్యక్రియలు నిర్వహించాలని చందాలు వసూలు చేసిందా మహాతల్లి. కానీ, చివరికి ఆమె పాపం పండడంతో కటకటాల వెనక్కి వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ అమ్మతనానికి మచ్చుక తెచ్చే ఘటన. 20 ఏళ్ల ఏంజెల్ లీన్ మారీన్ అనే యువతి గత మంగళవారం వేకుజామున ఈ ఘాతుకానికి పాల్పడింది. పిల్లాడు గుక్కపట్టి ఏడుస్తుండడంతో చిరాకు చెందిన మారీన్.. ఆ బాబును రెండు దుప్పట్ల మధ్య చుట్టి ఊపిరాడకుండా చేసింది. ఆ తర్వాత దుప్పట్ల నుంచి బయటకు తీసి నెలకేసి కొట్టింది. దాంతో ఆ పసివాడు అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు మాములుగా వెళ్లి పడుకుంది. తర్వాతి రోజు ఉదయం లేచి అనారోగ్యం తన బాబు చనిపోయాడని, అంత్యక్రియల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు 'గోఫండ్‌మీ' (GoFundMe) ఆన్‌లైన్ పేజీ క్రియేట్ చేసింది.

Wife: పుట్టింటికి వెళ్లిన భార్య.. 150 సార్లు కాల్ చేసినా ఫోన్‌ లిఫ్ట్ చేయకపోవడంతో భర్తకు డౌట్.. నేరుగా అత్తారింటికి వెళ్తే..!

"బాబు మృతి మాకు తీరని లోటు. బాబు గుర్తుగా అతని అస్తికల (Ashes) తో ఒక లాకేట్ చేయించుకోవాలి. అలా చేయడం ద్వారా బాబు ఎల్లప్పుడు నాతోనే ఉంటాడు. అంత్యక్రియలతో పాటు జువెలరీకి కూడా కొంత డబ్బు కావాలి. మీకు తోచిన సహాయం చేయండి" అని ఆ ఫండ్‌రైజింగ్ పేజీలో మారీన్ రాసుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పిల్లాడి తండ్రికి అనుమానం వచ్చింది. బాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించాలని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ఊపిరాడకపోవడంతోనే పిల్లాడు చనిపోయినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వచ్చింది. దాంతో అతడు వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. రంగంలోకి దిగిన పోలీసులు మొదట మారీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో ఆమె చెప్పిన విషయం విని షాకయ్యారు. పిల్లాడు ఏడుపు ఆపకపోవడంతో చిరాకేసి దుప్పట్లో వేశానని, అప్పటికీ ఇంకా ఏడుస్తుండడంతో నేలకేసి కొట్టినట్టు చెప్పింది. అక్కడే బాబు చనిపోయినట్టు తెలిపింది. ఆ తర్వాత 'గోఫండ్‌మీ' పేజీ క్రియేట్ చేసి చందాలు వసూలు చేశానని పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు మారీన్‌పై మర్డర్ కేసు నమోదు చేసి, కటకటాల వెనక్కి నెట్టారు.

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో వింత ఘటన.. 82 ఏళ్ల బామ్మ నామినేషన్.. ఆమె కథేంటో తెలిస్తే కన్నీళ్లు రావడం ఖాయం..!

Updated Date - 2023-11-12T12:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising