Best Countries for Expats: ప్రవాసులకు అన్ని విధాల బెస్ట్ దేశం ఏదో తెలుసా..?
ABN, First Publish Date - 2023-04-13T14:15:51+05:30
ఇంటర్‌నేషన్స్ (InterNations) అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రవాసులకు అన్ని విధాల సౌకర్యవంతమైన దేశాల జాబితాలో గల్ఫ్ దేశాలు బెస్ట్ అనిపించుకున్నాయి.
ఎన్నారై డెస్క్: ఇంటర్‌నేషన్స్ (InterNations) అనే సంస్థ తాజాగా విడుదల చేసిన ప్రవాసులకు అన్ని విధాల సౌకర్యవంతమైన దేశాల జాబితాలో గల్ఫ్ దేశాలు బెస్ట్ అనిపించుకున్నాయి. టాప్-10 దేశాల లిస్ట్‌లో ఏకంగా నాలుగు దేశాలు చోటు దక్కించుకోవడం విశేషం. వాటిలో బహ్రెయిన్ (Bahrain) మొదటి ర్యాంకులో నిలిస్తే.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) రెండో ర్యాంకు సాధించింది. ఇక ఒమాన్, సౌదీ అరేబియా, ఖతార్ వరుసగా ఐదు, ఏడు, ఎనిమిది స్థానాలు దక్కించుకున్నాయి. ప్రవాసులకు సులువుగా రెసిడెన్సీ (Residency), పని దొరకడం అనే విషయాలను పరిగణలోకి తీసుకుని 52 గమ్యస్థానాలను ఇంటర్‌నేషన్స్ ఎంపిక చేసింది.
అలాగే ఎక్స్‌ప్యాట్ ఇన్‌సైడర్ 2022 సర్వే డేటాను (Expat Insider 2022 Survey Data) కూడా దీనికోసం వినియోగించడం జరిగింది. ఇక బహ్రెయిన్ ఫస్ట్ ర్యాంక్‌లో నిలవడానికి ప్రవాసులు చెప్పిన ప్రధాన కారణం.. అక్కడ స్థానిక అధికారులు వలసదారులకు ప్రభుత్వ సర్వీసులను చాలా సులువుగా అందజేయడమే. ఇక 70 శాతం మంది ఇక్కడ వీసా ప్రాసెస్ (Visa Process) కూడా చాలా ఈజీ అని చెప్పడం జరిగింది. అలాగే వరల్డ్ వైడ్ ఇతర దేశాలతో పోలిస్తే బహ్రెయిన్‌లో రెసిడెన్సీ చాలా సులువు అని 56 శాతం మంది తెలిపారు. అంతేగాక లోకల్ లాంగ్వేజ్‌లో మాట్లాడకుండా కూడా ఇక్కడ పని చేసుకునే వెసులుబాటు ఉంటుందట. ఇలా అన్ని విధాల ప్రవాసులకు బెస్ట్ దేశం బహ్రెయినే అని ఇంటర్‌నేషన్స్ తేల్చింది.
అమెరికాలో ఇద్దరు తెలుగు చిన్నారులకు అరుదైన గౌరవం
Updated Date - 2023-04-13T14:15:51+05:30 IST