Milk: బహ్రెయిన్ సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా అలాంటి పాలపై బ్యాన్!
ABN, First Publish Date - 2023-02-19T09:55:57+05:30
గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.
మనామా: గల్ఫ్ దేశం బహ్రెయిన్ (Bahrain) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. పాశ్చరైజ్ చేయని పాలు (Unpasteurised Milk), దాని సంబంధిత ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రిత్వశాఖ (Ministry of Health) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో దుకాణదారులకు కీలక సూచనలు చేసింది. పాశ్చరైజ్ చేయని పాలు, ఆ పాలతో తయారు చేసే ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించకూడదని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లైసెన్స్ పొందిన పాల కేంద్రాల నుంచి పొందిన పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని తన ప్రకటనలో పేర్కొంది.
ఇక పాశ్చరైజ్ పాలలో సూక్ష్మజీవులను తొలగించడానికి తగిన ప్రాసెస్ ఉంటుంది. అలాగే మంచి ప్యాకింగ్ కూడా లభిస్తుంది. అలాంటి పాల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఉద్ఘాటించింది. నాణ్యతలేని, కలుషితమైన పాలను వినియోగించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారినపడతారని అధికారులు తెలిపారు. 'పాలు చాలా త్వరగా పాడైపోయే ఆహారం. అదే సమయంలో కలుషితం అయ్యే ప్రమాదం కూడా చాలా ఎక్కువ. నాణ్యతలేని పాల ఉత్పత్తులను ఎట్టిపరిస్థితులలో విక్రయించవద్దు' అని ఆరోగ్యశాఖ చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!
Updated Date - 2023-02-19T09:57:37+05:30 IST