ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Abdullah Bin Adel Fakhro: భారత్-బహ్రెయిన్ ఆర్థిక సంబంధాలు భేష్

ABN, First Publish Date - 2023-02-21T14:00:15+05:30

భారత్, బహ్రెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు (Bahraini Indian Economic Relations) అత్యున్నత స్థానంలో ఉన్నాయని ఆ దేశ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అదెల్ ఫఖ్రో (Abdullah Bin Adel Fakhro) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనామా: భారత్, బహ్రెయిన్ మధ్య ఆర్థిక సంబంధాలు (Bahraini Indian Economic Relations) అత్యున్నత స్థానంలో ఉన్నాయని ఆ దేశ పరిశ్రమ, వాణిజ్య మంత్రి అబ్దుల్లా బిన్ అదెల్ ఫఖ్రో (Abdullah Bin Adel Fakhro) తెలిపారు. ప్రధానంగా వాణిజ్య రంగంలోమెరుగైన సంబంధాలు ఉన్నాయన్నారు. బహ్రెయిన్‌లో పారిశ్రామిక/మెడికల్ గ్యాసెస్‌పై జరిగిన 42వ ఇంటర్నేషనల్ సెమినార్‌లో భారత రాయబారి పీయూష్ శ్రీవాస్తవ, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIIGMA) అధ్యక్షుడు సాకేత్ సమక్షంలో జరిగిన గాలా డిన్నర్‌లో ఫఖ్రో ముఖ్యవక్తగా పాల్గొన్నారు. భారత ఎంబసీ సహకారంతో ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (EDB), అనేక సంబంధిత అధికారుల భాగస్వామ్యంతో ఏఐఐజీఎంఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా బహ్రెయిన్ మంత్రి ఫఖ్రో మాట్లాడారు. రెండు దేశాల మధ్య చమురేతర వాణిజ్యం పరిమాణం 1.4బిలియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నారు. ఇందులో ఇండియా నుంచి దిగుమతులు 904 మిలియన్ డాలర్లు కాగా, ఎగుమతులు 498 మిలియన్ డాలర్లు అని తెలిపారు. ఇక ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలో పారిశ్రామిక రంగ వ్యూహం 2022-26 ప్రారంభించినప్పటి నుంచి సాధించిన అత్యంత సానుకూల ఫలితాలను మంత్రి ఫఖ్రో ప్రస్తావించారు. ఈ సెమినార్‌లో ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ ప్యానెల్ చర్చ, పారిశ్రామిక/మెడికల్ గ్యాసెస్‌కు సంబంధించిన అంశాలు, బహ్రెయిన్, భారత్ మధ్య సహకారాన్ని పెంపొందించే మార్గాల గురించి ప్రధానంగా చర్చలు జరిగాయి.

ఇది కూడా చదవండి: అనుకుంది సాధించిన కువైత్.. ఆ శాఖలో ఒక్క ప్రవాస ఉద్యోగి కూడా లేకుండా చేసేసింది!

Updated Date - 2023-02-21T14:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising