Kuwait లో ప్రారంభమైన గూగుల్ పే సేవలు..
ABN, First Publish Date - 2023-03-02T09:16:32+05:30
గల్ఫ్ దేశం కువైత్‌లోని (Kuwait) అనేక బ్యాంకులు గూగుల్ పే (Google Pay) సేవలను ప్రారంభించాయి.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లోని (Kuwait) అనేక బ్యాంకులు గూగుల్ పే (Google Pay) సేవలను ప్రారంభించాయి. ఇది ఆయా బ్యాంక్ కస్టమర్లు వారి ఆండ్రాయిడ్, వేర్ ఓఎస్ (Wear OS) ద్వారా సులభంగా, సురక్షితంగా వినియోగించుకోవడానికి అనుమతి ఇస్తుంది. గూగుల్ పేతో కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు (Contactless Payments) చేయడానికి కస్టమర్లు తమ ఆండ్రాయిడ్ పరికరాన్ని ఇన్-స్టోర్ పేమెంట్ టర్మినల్ దగ్గర పట్టుకుని లావాదేవీలను పూర్తి చేయవచ్చు. కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ (Commercial Bank of Kuwait) తమ కార్డ్ హోల్డర్లు తమ అల్-తిజారీ కార్డులను (Al-Tijari Cards) గూగుల్ వాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ డివైజ్‌ల ద్వారా కస్టమర్లు ఎక్కడైనా చెల్లింపులు చేయడానికి వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.
అలాగే నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైత్ (National Bank of Kuwait), బుర్గాన్ బ్యాంక్, అహ్లీ యునైటెడ్ బ్యాంక్(Ahli United Bank) కూడా కువైత్‌లోని తమ కస్టమర్ల కోసం ఇలాంటి ఫీచర్లను ప్రారంభించినట్లు తెలిపాయి. ప్రతి గూగుల్ పే కొనుగోలు సురక్షితంగా ఉంటుంది. ఇది ఫేషియల్ రికగ్నైజేషన్, పాస్‌వర్డ్, వేలిముద్ర గుర్తింపుతో (Fingerprint Identification) పని చేస్తుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపులను ఆమోదించే ప్రతి అవుట్‌లెట్‌లో గూగుల్ పే కూడా ఆమోదించబడుతుంది. స్మార్ట్ వాచ్‌లు, టాబ్లెట్ లేదా ఇతర పరికరాలతో సహా ఏదైనా ఆండ్రాయిడ్, వేర్ ఓఎస్ గ్యాడ్జెట్స్‌లలో సైతం వినియోగదారులు గూగుల్ పేను ఉపయోగించుకోవచ్చు.
ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!
Updated Date - 2023-03-02T09:16:32+05:30 IST