ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అదిరిపోయిన బ్రిటన్ ప్రధాని ఐడియా.. అధికారులకు అరటి ఆకుల్లో భోజనాలు..

ABN, First Publish Date - 2023-01-17T18:34:01+05:30

సంక్రాంతి/పొంగల్ పండుగ పురస్కరించుకుని ప్రధాని రిషి సునాక్.. తన కార్యాలయ సిబ్బందికి సాంప్రదాయిక విందు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసంలో సంక్రాంతి(Sankranti) శోభ వెల్లివిరిసింది. సంక్రాంతి/పొంగల్ పండుగ పురస్కరించుకుని ప్రధాని రిషి సునాక్.. డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో ఉద్యోగులకు సంప్రదాయ విందు ఏర్పాటు చేశారు. అరటి ఆకుల్లో వడ్డించిన భారతీయ వంటకాలను ఆరగిస్తున్న ఉద్యోగుల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెల్లపు పాయసం, ఇడ్లీ, చట్నీ, అరటిపళ్లను సిబ్బంది ఆరగించారు. సంప్రదాయిక దుస్తుల్లో ఓ వ్యక్తి ‘‘ఇంకాస్త వడ్డించమంటారా’’ అని అధికారులను అడగడం.. వంటకాలు భలే రుచిగా ఉన్నాయంటూ కొందరు ప్రశంసించడం.. వైరల్‌గా మారాయి. అయితే.. చేతితో తినే అలవాటు లేక కొందరు ఇబ్బంది పడ్డారని నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ విందు సాంస్కృతిక వైవిధ్యానికి(Diversity) పట్టం కట్టినట్టు ఉందన్న ప్రశంసల వెల్లువెత్తాయి.

అంతకుమునుపు బ్రిటన్ ప్రధాని.. సంక్రాంతి/పొంగల్ జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ శుభసందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ పర్వదినం దేశంలోని అనేక కుటుంబాలకు ఎంత విశిష్టమైనదో నాకు తెలుసు. బ్రిటన్‌ ప్రజలతో పాటూ వివిధ దేశాల్లో పొంగల్ జరుపుకుంటున్న వారందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్యర్యం, శాంతిసౌభాగ్యాలు కలగాలని ఆశిస్తున్నా’’ అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రిషి సునాక్ గతేడాది అక్టోబర్ 24న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి రికార్డు సృష్టించారు.

Updated Date - 2023-01-17T18:39:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising