UK PM: రిషి సునాక్‌ను చిక్కుల్లో పడేసిన పెంపుడు శునకం.. చివరికి పోలీసులతో చెప్పించుకోవాల్సి వచ్చింది.. అసలేం జరిగిందంటే..!

ABN, First Publish Date - 2023-03-16T11:02:14+05:30

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను (Britain PM Rishi Sunak) పెంపుడు కుక్క (Dog) చిక్కుల్లో పడేసింది.

UK PM: రిషి సునాక్‌ను చిక్కుల్లో పడేసిన పెంపుడు శునకం.. చివరికి పోలీసులతో చెప్పించుకోవాల్సి వచ్చింది.. అసలేం జరిగిందంటే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను (Britain PM Rishi Sunak) పెంపుడు కుక్క (Dog) చిక్కుల్లో పడేసింది. తన పెంపుడు శునకం వల్ల ప్రధాని అంతటి వ్యక్తి చివరికి పోలీసులతో చెప్పించుకోవాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన కుటుంబ సభ్యులతో కలిసి రిషి సునాక్ రాజధాని లండన్‌లోని హైడ్ పార్క్‌కు( Hyde Park in London ) వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని దంపతులు తమతో పాటు పెంపుడు శునకాన్ని కూడా తీసుకెళ్లారు. అయితే, పార్క్‌కు వెళ్లిన తర్వాత కుక్క మెడకు ఎలాంటి గొలుసులు కట్టకుండా ఫ్రీగా వదిలేశారు. ఇది అక్కడి నిబంధనలకు విరుద్ధం. దీనిని గమనించిన పోలీసులు వెంటనే ప్రధాని వద్దకు చేరుకుని నిబంధనల చిట్టా విప్పడంతో పాటు కుక్క మెడకు పట్టీ పెట్టి అందించారు. ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడే ఉన్నర ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్‌ అయింది.

Rishi.jpg

అయితే, ప్రధాని రిషి రూల్స్ బ్రేక్ చేయడం ఇదే తొలిసారేమి కాదు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందు కూడా పలుమార్లు ఆయన తన వైఖరితో విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. 2020 జూన్‌లో కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలుచేస్తున్న సమయంలో రిషి సునాక్.. కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసి 10 డౌన్ స్ట్రీలో పార్టీ చేసుకున్నారు. గతేడాది ఇంగ్లాండ్ అత్యంత కరువును, హీట్ వేవ్‌ను ఎదుర్కొంటున్న సమయంలో రిషి సునాక్ తీరు విమర్శలకు తావిచ్చింది. రిషి సునాక్ తన వారాంతాలను నార్త్ యార్క్‌షైర్‌లోని (North Yorkshire) ఇంట్లో భార్య అక్షతామూర్తి (Aksathamurthy), ఇద్దరు పిల్లలతో గడుపుతారు. ఇందులో జిమ్, టెన్నిస్ కోర్టులను కూడా నిర్మిస్తున్నారు. అన్నింటికి మించి దాదాపు రూ. 3.8 కోట్లతో అత్యంత విలాసవంతంగా నిర్మించిన స్విమ్మింగ్ పూల్ సైతం ఆయనను వివాదంలోకి నెట్టింది. అలాగే ఇటీవల కారులో సీటు బెల్టు లేకుండా ప్రయాణించి మీడియాకు చిక్కారు. ఇది పోలీసుల కంటపడటంతో ప్రధానికి 50 పౌండ్ల జరిమానా కూడా విధించారు.

ఇది కూడా చదవండి: 14ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న భారతీయుడు.. అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు..!

Updated Date - 2023-03-16T11:02:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising