ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: మనీలాలో ఘోరం.. ఎన్నారై దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి చొరబడి మరి కాల్చిచంపిన దుండగుడు!

ABN, First Publish Date - 2023-03-29T09:16:21+05:30

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో (Manila) ఘోరం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనీలా: ఫిలిప్పీన్స్ (Philippines) రాజధాని మనీలాలో (Manila) ఘోరం జరిగింది. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఎన్నారై దంపతులు (NRI Couple) దారుణ హత్యకు గురయ్యారు. ఆ దంపతులు తమ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరినీ కాల్చిచంపాడు. దుండగుడి కాల్పుల్లో చనిపోయిన దంపతులను సుఖ్వీందర్ సింగ్ (41), కిరణ్ ప్రీత్ కౌర్ (33)గా గుర్తించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, సుఖ్వీందర్ సింగ్ సుమారు రెండు దశాబ్దాలుగా మనీలాలో ఉంటున్నారు. ఫైనాన్స్ బిజినెస్ (Finance Business) చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే భార్య కిరణ్ దీప్ కౌర్ అక్కడికి వెళ్లినట్లు సమాచారం. ఇక సుఖ్విందర్ సోదరుడు లఖ్వీర్ సింగ్ కూడా వారితోనే కలిసి ఉంటున్నాడు.

అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ కార్యక్రమం కోసం స్వదేశానికి వచ్చాడు. సుక్వీందర్ సింగ్ (Sukhwinder Singh) తన పనులు ముగించుకొని సోమవారం సాయంత్రం సమయంలో ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత భోజనం చేసి ఇంటి బయట వచ్చి కూర్చున్నాడు. ఆ సమయంలో గుర్తుతెలియని ఓ దుండగుడు వారి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంటి బయట కూర్చొని ఉన్న సుక్వీందర్‌పై ఒక్కసారిగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడే కుప్పకూలిపోయాడు. ఇక కాల్పుల శబ్దం విన్న కిరణ్ ప్రీత్ కౌర్ (Kiranpreet Kaur) ఏం జరిగిందో చూద్దామని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది. డోర్ దగ్గరికి వచ్చే సరికే ఆ దుండగుడు ఆమెపై కూడా కాల్పులు జరిపారు. దీంతో ఆమె కూడా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

ఇది కూడా చదవండి: బ్రిటన్‌లో మనోళ్లే బెటర్.. అక్కడి వారి కంటే ఎన్నారైలకే సొంతిళ్లు ఎక్కువ.. ఇదొక్కటే కాదండోయ్..!

ఇదంతా వారి ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనతో సుఖ్వీందర్ సింగ్ స్వస్థలం జలంధర్‌లోని మెహసంపూర్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ విషయాన్ని భారత ఎంబసీ అధికారులు ఫిలిప్పీన్స్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని సుఖ్విందర్ సోదరుడు లఖ్వీర్ సింగ్ కోరారు. అప్పుడే ఈ దారుణానికి పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొవచ్చని అన్నారు.

ఇది కూడా చదవండి: హెచ్‌1బీ వీసా కోటా పూర్తి.. అర్హులైన వారు తదుపరి చర్యలు ప్రారంభించుకోవచ్చు..

Updated Date - 2023-03-30T08:02:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising