ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: అమెరికాలో అక్రమంగా ఎంట్రీ.. ఒక్కో భారతీయుడి నుంచీ 21 వేల డాలర్లు వసూలు..

ABN, First Publish Date - 2023-02-05T20:59:37+05:30

భారతీయులను సరిహద్దు దాటించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశపెట్టేందుకు క్రిమినల్ గ్యాంగ్‌లు ఒక్కొక్కరి నుంచీ 21 వేల డాలర్లు పుచ్చుకుంటున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: భారతీయులను(Indians) సరిహద్దు దాటించి అమెరికాలోకి(USA) అక్రమంగా ప్రవేశపెట్టేందుకు(Illegal Entry) క్రిమినల్ గ్యాంగ్‌లు ఒక్కొక్కరి నుంచీ 21 వేల డాలర్లు పుచ్చుకుంటున్నాయని అరిజోనా రాష్ట్రాంలోని ఓ సరిహద్దు ప్రాంతపు పోలీసు అధికారి మార్క్ డేనల్స్ తాజాగా పేర్కొన్నారు. కార్టెల్స్‌గా(Cartels) పేరుపడ్డ ఈ గ్యాంగులు వివిధ దేశాల్లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. వలసదారులు ఏం దేశం నుంచి వస్తున్నారన్న దాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌లు ఒకొక్కరి నుంచీ కనీసం 7 వేల డాలర్లు వసూలు చేస్తాయన్నారు. ఈ మేరకు రాష్ట్ర చట్టసభ్యులు అడిగిన వివరాలు ఇచ్చారు. మెక్సికో-అమెరికా సరిహద్దు వద్ద భద్రతావ్యవస్థ సరిగా లేదని కూడా వెల్లడించారు. ‘‘సరిహద్దు దాటి అమెరికాలో ఎవరు ప్రవేశించాలో వారే నిర్ణయిస్తారు. వలసదారులు ఎవరనే దాన్నిబట్టి ధర నిర్ణయించి వసూలు చేస్తారు. భారతీయుల విషయంలో ఇది 21 వేల డాలర్లుగా ఉంది’’ అని తెలిపారు.

Updated Date - 2023-02-05T21:01:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising