#HappyBirthdayKCR: బహ్రెయిన్‌లో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
ABN, First Publish Date - 2023-02-18T10:58:31+05:30
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నారైలు బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు.
ఎన్నారై డెస్క్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నారైలు బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు. సతీష్ కుమార్ కేక్ కట్ చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉప అధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి తెచ్చి తొలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదిన్నర ఏండ్లుగా రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనిడయాడారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని ప్రశంసించారు. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్పుకొచ్చారు. నాడు ఉద్యమం సమయంలో గులాబీ జెండాను లండన్ తరువాత బహ్రెయిన్‌లో ఎగరవేసి కేసీఆర్ వెంట నడిచామని అదే స్పూర్తితో నేడు దేశంలో గుణాత్మక మార్పుకోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండాను సైతం బహ్రెయిన్‌లో కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆవిష్కరించడం చాలా గర్వంగా ఉందన్నారు. బహ్రెయిన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసులు బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ నాయకత్వంలో పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ నేతృత్వంలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్లలా ఉందన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దేశానికి నాయకత్వం వహించాలని ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ నిండు నూరేండ్లు ఆరోగ్యాంగా, సంతోషంగా ఉండి, భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు వెంకటేష్ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు చెన్నమనేని రాజేందర్, సంగేపోలు దేవన్న, ఉత్కం కిరణ్ గౌడ్, తెరాస నాయుకులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Updated Date - 2023-02-18T10:58:45+05:30 IST