ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: మలేషియాలో అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు

ABN, First Publish Date - 2023-06-04T08:08:44+05:30

మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పాంకోర్టు, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్, మలేషియాలో అట్టహాసంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: మలేషియా తెలంగాణ అసోసియేషన్ (MYTA) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పాంకోర్టు, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్, మలేషియాలో అట్టహాసంగా జరిగాయి. "జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం" గీతంతో కార్యక్రమం ప్రారంభమయింది అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి అందరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ అమర వీరులకు నివాళులర్పించి ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులతో పాటుగా భారీ సంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి వెల్లివిరిసేలా పలు సాంస్కృతిక కార్యక్రమములు, చిన్నారుల ఆట పాటలు ప్రేక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన సందర్భంలో 60 ఏండ్ల పోరాట చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రారంభమైన మలేషియా తెలంగాణ అసోసియేషన్ కూడా పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాలు కూడా జరపడానికి సన్నాహాలు ప్రారంభిస్తుందని తెలిపారు. అలాగే 'మైట' సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతి, జాయింట్ ట్రేజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి.. ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్ అశ్విత, యూత్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ రవితేజ.. కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు.. మైగ్రెంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-04T08:08:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising