ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: వార్నింగ్.. వీధుల్లో ఆ పని చేస్తే రూ.1లక్ష వరకు జరిమానా.. జైలు శిక్ష!

ABN, First Publish Date - 2023-03-26T09:40:07+05:30

యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE Public Prosecution) శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ పౌరులు, నివాసితులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అబుదాబి: యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (UAE Public Prosecution) శుక్రవారం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దేశ పౌరులు, నివాసితులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తే భారీ జరిమానా, జైలుకి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డిక్రీ-లా నం.31లోని ఆర్టికల్ 475 ప్రకారం భిక్షాటన చేయడం నేరం అని పేర్కొంది. దీనికి గాను 5వేల దిర్హమ్స్ (రూ.1.12లక్షల) జరిమానా ఉంటుందని, అలాగే మూడు నెలలకు మించకుండా జైలు శిక్ష కూడా ఉంటదని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.

ఇక కింద పేర్కొన్న సందర్భాలలో భిక్షాటన చేసినట్లు నేరం రుజువైతే మరింత కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించింది. బిచ్చం ఎత్తుకునే వ్యక్తి శారీరక అంగవైకల్యం కలిగి ఉండకపోయినా, అతను/ఆమెకు స్పష్టమైన జీవన వనరు ఉంటే, అతను/ఆమె ఇతరులకు సేవ చేస్తున్నట్లు నటిస్తే, బిచ్చం ఎత్తుకునే అతను/ఆమె తన పట్ల జాలిపడేలా ఇతరులను ప్రభావితం చేయడానికి ఏదైనా ఇతర మోసపూరిత మార్గాలను అనుసరించిన సందర్భంలో శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పుకొచ్చింది. కాగా, సమాజంలోని సభ్యులలో చట్టపరమైన అవగాహనను ప్రోత్సహించడానికి, దేశంలోని తాజా చట్టం గురించి వారిలో మరింత జ్ఞానాన్ని పెంపొందించడానికి యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిరంతర ప్రయత్నాలలో భాగంగా తాజాగా చేపట్టిన ఈ చర్య కూడా వస్తుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: 'ఐఫోన్ 14' కొనేందుకు 12ఏళ్ల అమ్మాయి.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!

Updated Date - 2023-03-26T09:40:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising