ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nomad Passport Index: వరల్డ్‌లోనే బెస్ట్ పాస్‌పోర్ట్ యూఏఈదే.. మన ర్యాంక్ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

ABN, First Publish Date - 2023-05-16T09:44:08+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డాక్యుమెంట్‌గా గుర్తింపు పొందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డాక్యుమెంట్‌గా గుర్తింపు పొందింది. కన్సల్టింగ్ సంస్థ నోమాడ్ క్యాపిటలిస్ట్ సంకలనం చేసిన ఇండెక్స్‌లో ఎమిరాటీ పాస్‌పోర్ట్ ఈ ఏడాది తొలిసారిగా టాప్ 10లోకి ప్రవేశించింది. గతేడాది 35వ స్థానంలో యూఏఈ పాస్‌పోర్టు (UAE Passport) 2023లో నేరుగా మొదటి స్థానానికి ఎగబాకడం విశేషం. నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Nomad Capitalist Passport Index) ప్రకారం పాస్‌పోర్ట్ అందించే ప్రయాణ స్వేచ్ఛకు తోడు అదనంగా దేశ వ్యాపార అనుకూల వాతావరణం, ఆశించదగిన పన్ను విధానమే దీనికి ప్రధాన కారణం అని నోమాడ్ క్యాపిటలిస్ట్ వెల్లడించింది. కాగా, 199 దేశాల పాస్‌పోర్టులకు సంబంధించి వెలువడిన ఈ ఇండెక్స్‌లో భారత పాస్‌పోర్టుకు 159వ ర్యాంక్ దక్కింది.

ఇక 199 దేశాల నోమాడ్ క్యాపిటలిస్ట్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది ప్రధానంగా ఐదు అంశాల ఆధారంగా రూపొందింది. ఆ 5 అంశాలను ఒకసారి పరిశీలిస్తే..

* వీసా రహిత ప్రయాణం: యూఏఐ పాస్‌పోర్ట్ హోల్డర్ వీసా రహితంగా మొత్తం 181 గమ్యస్థానాలకు వెళ్లొచ్చు. వీటిలో వీసా లేకుండా, వీసా ఆన్ అరైవల్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ఉన్నాయి.

* పౌరుల పన్ను: ఇండెక్స్ ప్రకారం యూఏఈలో పన్నుల స్కోర్ 50గా ఉంది. అంటే యూఏఈ పౌరులు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీని అర్థం 'సున్నా పన్నులు' అన్నమాట.

* అవగాహన (Perception): ప్రతి దేశం పౌరులు ఎలా స్వీకరించబడతారు, గుర్తింపును పొందుతారు అనే దానిని గుర్తించడానికి కంపెనీ ప్రపంచ సంతోష నివేదిక (World Happiness Report), మానవ అభివృద్ధి సూచిక (Human Development Index), ఆత్మాశ్రయ కారకాలపై (Subjective factors) ఆధారపడింది.

* ద్వంద్వ పౌరసత్వం: ఇందులో 30 స్కోర్ ఉన్న యూఏఈ పౌరులు తరచూ ఇతర దేశాల పౌరసత్వాలను కలిగి ఉండటానికి అనుమతించబడతారు.

* వ్యక్తిగత స్వేచ్ఛ: ఇది తప్పనిసరి సైనిక సేవ, ప్రభుత్వ నిఘా, పత్రికా స్వేచ్ఛపై డేటాతో పాటు వార్తల నివేదికలపై ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ ఐదు అంశాలలో మొత్తం 110.5 స్కోర్‌తో ఎమిరాటీ పాస్‌పోర్ట్ ఏకంగా నం.01 ర్యాంక్ దక్కించుకుంది. ఇక భారత్ 44.50 స్కోర్‌తో 159వ ర్యాంక్‌కు పరిమితమైంది.

India-UAE flights: మరో భారత నగరం నుంచి దుబాయ్‌కి డైరెక్ట్ విమానం.. పైగా వీక్లీ మూడు సర్వీసులు కూడా..


ఈ ఇండెక్స్‌లో టాప్-10 ర్యాంకులు పొందిన పాస్‌పోర్టులివే..

1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

2. లక్సెంబర్గ్

3. స్విట్జర్లాండ్

4. ఐర్లాండ్

5. పోర్చుగల్

6. జర్మనీ

7. చెక్ రిపబ్లిక్

8. న్యూజిలాండ్

9. స్వీడన్

10. ఫిన్లాండ్

Kuwait: కువైత్ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. వందల మంది ప్రవాసులు అరెస్ట్!

Updated Date - 2023-05-16T09:44:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising