ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: 'వాళ్లలో దాదాపు సగం మంది నా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేంత విధేయులు'

ABN, First Publish Date - 2023-03-16T07:52:02+05:30

వివాదాలకు కేంద్ర బిందువైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్య లు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రాణి ఎలిజబెత్‌, డయానా... నా అడుగులకు మడుగులొత్తేవాళ్లు!

150 లేఖలతో పుస్తకం

వాషింగ్టన్‌, మార్చి 15: వివాదాలకు కేంద్ర బిందువైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి సంచలన వ్యాఖ్య లు చేశారు. రాణి ఎలిజబెత్‌-2, ప్రిన్సెస్‌ డయానా, ఓప్రా విన్‌ఫ్రే వంటి పలుకుబడి కలిగిన వ్యక్తులు తనకు సంపూర్ణ విధేయులని.. తన అడుగులకు మడుగులొత్తేవాళ్లని చెప్పారు. సుప్రసిద్ధ వ్యక్తులు తనకు పంపిన ప్రైవేటు లేఖలతో కూడిన కొత్త పుస్తకం ‘లెటర్స్‌ టు ట్రంప్‌’ ప్రచారంలో భాగంగా ట్రంప్‌ ఈ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ‘ది గార్డియన్‌’ పేర్కొంది. ఈ పుస్తకాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయనున్నట్టు దాని ప్రచురణకర్త విన్నింగ్‌ పబ్లిషింగ్‌ తెలిపింది. క్వీన్‌ ఎలిజబెత్‌-2, ప్రిన్సెస్‌ డయానా, ఓప్రా విన్‌ఫ్రే, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, ఉత్తర కొరియా నేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ వంటి అత్యంత శక్తిమంతమైన, ప్రభావవంతమైన వ్యక్తులతో ట్రంప్‌ జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

‘‘వారందరూ నాకు తెలుసు. అలాగే వారిది ఎంతో మనోహరమైన జీవితం. వాళ్లలో దాదాపు సగం మంది నా కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేంత విధేయులు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. 150 లేఖల్లో క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌, మైకేల్‌ జాక్సన్‌, అమెరికా మాజీ అధ్యక్షులు రిచర్డ్‌ నిక్సన్‌, జార్జి డబ్ల్యూ బుష్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా తదితరులు రాసినవీ ఉన్నాయి. కాగా, రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఉన్నతస్థాయి సెలబ్రిటీలు తన తండ్రితో భిన్నంగా ప్రవర్తించారని ఆయన పెద్ద కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: 'ఆ వ్యవధిలో కొత్త పని వెతుక్కోవడం కష్టం.. దానివల్ల ప్రతిభావంతుల్ని కోల్పోతున్నాం'

Updated Date - 2023-03-16T07:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising