UAE: నిన్నటి వరకు పదికి ఇరవైకి స్నేహితుల వద్ద చేతులు చాచిన ఆమె.. ఇవాళ కోటీశ్వరురాలు.. రాత్రికి రాత్రే మారిపోయిన సేల్స్ ఉమెన్ ఫ్యూచర్..
ABN, First Publish Date - 2023-03-02T11:33:20+05:30
ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ మహజూజ్ డ్రాలో జాక్‌పాట్ కొట్టింది.
అబుదాబి: ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళ మహజూజ్ డ్రాలో జాక్‌పాట్ కొట్టింది. సేల్స్ ప్రమోటర్‌గా (Sales Promoter) పని చేస్తున్న ఆమె తాజాగా నిర్వహించిన సూపర్ శాటర్‌డే డ్రాలో (Super Saturday Mahzooz Draw) ఏకంగా 10 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకుంది. అంటే.. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ. 22.47కోట్లు అన్నమాట. దాంతో ఆమె రాత్రికి రాత్రే మల్టీ మిలియనీర్‌గా అవతరించింది. ఆమె గెలుచుకున్న ప్రైజ్ మనీ తాలూకు చెక్‌ను (Cheque) మహజూజ్ నిర్వాహకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఫిలిప్పీన్స్‌కు (Filipino) చెందిన 40 ఏళ్ల అర్లీన్ గత 12 ఏళ్ల నుంచి యూఏఈ రాజధాని అబుదాబిలో (Abu Dhabi) నివాసం ఉంటోంది. స్థానికంగా ఉండే ఓ మార్కెటింగ్ సంస్థలో సేల్స్ ప్రమోటర్‌గా పని చేస్తోంది. ఇక ఆమెకు వచ్చే నెలవారీ వేతనం చాలా తక్కువ. దాంతో చాలాసార్లు అవసరాలకు స్నేహితుల వద్ద అప్పులు తీసుకుంటూ నెట్టుకువస్తుంది. ఈ క్రమంలో స్నేహితుల సలహా మేరకు మహజూజ్‌లో పాల్గొంది. అదృష్టం వరించడంతో గత శనివారం నిర్వహించిన డ్రాలో ఏకంగా రూ. 22.47కోట్ల జాక్‌పాట్ తగిలింది. అంతే.. ఆమె ఆనందానికి అవధుల్లేవు. తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన కష్టాలన్ని తీరిపోతాయని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇకపై స్నేహితులను పదికి ఇరవైకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!
ఇక అర్లీన్ గెలుచుకున్న ప్రైజ్ మనీ (Prize Money) తాలూకు చెక్‌ను ఆమెకు మహజూజ్ నిర్వాహకులు బుధవారం అందజేశారు. కాగా, ఈ ఏడాది ఇలా మల్టీ మిలియనీర్‌గా మారిన రెండో ఫిలిప్పీన్స్ ప్రవాసురాలు అర్లీన్ అని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఓ వ్యక్తికి ఈ జాక్‌పాట్ తగిలినట్లు వెల్లడించారు. మొత్తంగా మహజూజ్ రాఫెల్ ప్రారంభమైన 2021 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఫిలిప్పీన్స్ జాతీయులు ఇలా 10 మిలియన్ దిర్హమ్స్ లాటరీ గెలుచుకున్నట్లు వారు చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: బ్లూ కాలర్ వర్కర్స్, విజిట్ వీసాదారులకు ఈ 7 రెస్టారెంట్లలో ఉచిత భోజనం..
Updated Date - 2023-03-02T12:18:58+05:30 IST