ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Job loss insurance: యూఏఈలోని ఉద్యోగులకు కీలక సూచన.. అలా చేయకపోతే చాలా నష్టపోతారు!

ABN, First Publish Date - 2023-10-01T09:12:57+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) ఉద్యోగ భద్రత పథకం (Job loss insurance Scheme) కోసం నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తారీఖుతో గడువు ముగిసింది. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో నమోదు చేసుకోవడానికి ప్రకటించిన గడువు తేదీ అయిన అక్టోబర్ 1లోపు ఉద్యోగులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి.

Job loss insurance: యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ (United Arab Emirates) ఉద్యోగ భద్రత పథకం (Job loss insurance Scheme) కోసం నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 30వ తారీఖుతో గడువు ముగిసింది. జాబ్ లాస్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో నమోదు చేసుకోవడానికి ప్రకటించిన గడువు తేదీ అయిన అక్టోబర్ 1లోపు ఉద్యోగులు తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అలా చేయని వారు జరిమానా చెల్లించడంతోపాటు ఇతర పెనాల్టీలను సైతం ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇక ఈ పథకం అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే ఉద్యోగం కోల్పోయిన సందర్భంలో కొంత కాలం వరకు ఉద్యోగులకు ఆర్థిక మద్దతునిచ్చే మంచి స్కీమ్ కూడా. కాగా, పెనాల్టీల నుండి మినహాయింపుల వరకు ఉద్యోగ నష్ట బీమా పథకం గురించి యూఏఈలోని ఉద్యోగులు తెలుసుకోవాల్సి చాలా ఉంది.

జరిమానాలు..

గడువులోపు పథకంలో చేరని అర్హతగల ఉద్యోగులపై 400 దిర్హమ్స్ (రూ.9వేలు) జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే సభ్యత్వం తీసుకున్న తర్వాత గడువు తేదీ నుండి మూడు నెలలకు మించి ప్రీమియంలు చెల్లించని ఉద్యోగులకు 200 దిర్హమ్స్ (రూ.4,528) పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇక ఇతరుల నుండి పథకం బీమా ప్రయోజనాలను తీసుకుంటూ పట్టుబడిన ఉద్యోగులకు ఏకంగా 20వేల దిర్హమ్స్ (రూ.4.52లక్షలు) భారీ జరిమానా విధించబడుతుంది.

శాలరీ కట్..

స్కీమ్ కోసం సైన్ అప్ చేయని ఉద్యోగులకు శాలరీ కటింగ్ ఉంటుంది. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకారం చెల్లించని పెనాల్టీలను ఉద్యోగుల జీతం లేదా సర్వీస్ ఎండింగ్ బెనిఫిట్స్ నుండి తీసుకోవడం జరుగుతుంది.

కొత్త వర్క్ పర్మిట్ ఉండదు..

బీమా పథకానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని జరిమానాలను చెల్లించడంలో విఫలమైన ఉద్యోగులు, వాటిని క్లియర్ చేసే వరకు కొత్త వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడరు.

మినహాయింపులు..

పథకానికి దరఖాస్తు చేసుకునే వారికి మినహాయింపులు ఉన్నాయి. వీరిలో పెట్టుబడిదారులు, వ్యాపార యజమానులు, గృహ కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు, పెన్షన్ పొంది కొత్త యజమాని వద్ద చేరి పదవీ విరమణ చేసినవారిని మినహాయించి ఫెడరల్, ప్రైవేట్ ఉద్యోగులందరూ స్కీమ్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో జరిమానాలు తప్పవు.

Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..


Updated Date - 2023-10-01T09:12:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising