ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Geeta Rao Gupta: అమెరికాలో మరో భారత సంతతి మహిళకు కీలక బాధ్యతలు

ABN, First Publish Date - 2023-07-12T12:17:48+05:30

అగ్రరాజ్యం అమెరికా విదేశాంగశాఖలో భారత సంతతికి చెందిన గీతా రావు గుప్తా (Geeta Rao Gupta) కు కీలక బాధ్యతలు దక్కాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా విదేశాంగశాఖలో భారత సంతతికి చెందిన గీతా రావు గుప్తా (Geeta Rao Gupta) కు కీలక బాధ్యతలు దక్కాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూస్ కార్యాలయానికి ఆమె అంబాసిడర్‌గా (Ambassador-at-Large) ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ (Kamala Harris) ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి గీత భర్త అరవింద్ గుప్తా, కుమార్తె నయన గుప్తా, కోడలు మంజులీ మహేశ్వరి, స్నేహితురాలు కరోలినా రోజస్ కూడా హాజరయ్యారు. ఇక ఈ పదవికి ఎంపికైన తొలి శ్వేతజాతీయేతర మహిళగా గీతా రావు చరిత్ర సృష్టించారు. కాగా, గీతా రావు నియామకాన్ని మే నెలలో అమెరికన్ సెనేట్‌ (US Senate) 51–47 ఓట్ల తేడాతో ధ్రువీకరించిన విషయం విదితమే.

గీతా రావు మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) పుట్టారు. ఢిల్లీ, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో ఆమె విద్యాభ్యాసం చేశారు. బెంగళూరు యూనివర్సిటీ (Bangalore University) నుంచి సోషల్ సైకాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. అనంతరం పలు విశ్వవిద్యాలయాల్లోని సైకాలజీ విభాగాల్లో పని చేయడం జరిగింది. ఈ క్రమంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పనిచేస్తుప్పుడు దేశంలోనే తొలిసారిగా ఉమెన్స్ స్టడీస్ కారిక్యులమ్‌ను గ్రాడ్యుయేట్ విద్యార్ధుల కోసం ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించారు. ఇక 1980లో అమెరికాకు వెళ్లిన గీతా రావు.. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఉమెన్ (ఐసీఆర్‌డబ్ల్యూ) లో చేరి పలు కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

ఇక తనకు తాజాగా దక్కిన కీలక బాధ్యతల పట్ల ఆమె సెనేట్‌ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కెరీర్‌ను కొనసాగించడంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలను తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పిన ఆమె.. ఈ అంశంపై ఇండియాలో తాను డాక్టోరల్ పరిశోధనలు చేశానని పేర్కొన్నారు. ఈ అంశాలే మహిళలు అనుభవించే అసమానతలను సరిదిద్దడంపై దృష్టిసారించే వృత్తి వైపు తనను నడిపించాయని ఆమె చట్టసభ సభ్యులకు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎన్నో అసమానతలు, అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భద్రత విషయంలో ఎన్నో బెదిరింపులకు గురికావడంతో పాటు హింసకు కూడా మహిళలు భయపడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

UAE: ప్రైవేట్ రంగంలో ఉద్యోగ నియామకాల్లో కొత్త రూల్.. యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కష్టాలు మొదలైనట్టేనా?


Updated Date - 2023-07-12T12:17:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising