ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు

ABN, First Publish Date - 2023-11-03T07:58:34+05:30

గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్‌రన్ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు.

NRI: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు అక్టోబర్ 22న (ఆదివారం) బ్రాడ్‌రన్ హైస్కూల్‌లో నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలు నభూతో నభవిష్యత్తు అనేలా జరిగాయి. ఇంతకుముందు వాషింగ్టన్ డీసీ బతుకమ్మ చరిత్రలో జరగని విధంగా అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు, పిల్లలు ఇలా సుమారు 5000 అతిథుల వరకు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. జీటీఏ సంస్థ చైర్మన్, గ్లోబల్ ఉపాధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు,సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, కమిటి చైర్స్ & కో-చైర్స్ కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

జీటీఏ సంస్థ వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల సారథ్యంలో పెద్ద బతుకమ్మలతో సుమారు 200 పైగా బతుకమ్మలను తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే రాజకీయ నాయకులు, సంస్థ నిర్వాహాకులు అధిక సంఖ్యలో పాల్గొని డోలు డప్పులతో, పోతురాజు విన్యాసాలతో ఊరేగింపుగా తీసుకరావడం జరిగింది. బెస్ట్ బతుకమ్మ లకు బంగారు బహుమతులు, పట్టు చీరలు, కిడ్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, కోలాటం జానపద నృత్యాలు, డ్యాన్స్ పోటీలు, గౌరి మరియు జమ్మి పూజ నిర్వహించారు. స్థానిక రెస్టారెంట్ కంట్రీ ఓవెన్ అధినేత శ్రవణ్ పాడూరు సారథ్యంలో వర్జీనియాలో ఉన్న ప్రముఖ రెస్టారెంట్స్ పారడైజ్ ఇండియన్ కుసిన్, ఉడ్ల్యాండ్స్, కాకతీయ కిచెన్, తవ ఫ్రై, పేస్ట్రి కార్నర్, హైదరాబాద్ బిర్యానీ పాట్ వారు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు సుమారు 5000 అతిథులకు ఉచితంగా పసందైన భోజన కార్యక్రమం నిర్వహించారు.

ఈ వేడుకల్లో తెలుగు ఆడపడచులు జయ తేలుకుంట్ల, ప్రత్యూష నరపరాజు, మాధురి గట్టుపల్లి, జనత కంచర్ల, స్వర్ణ వీర్ల, జలజ ముద్దసాని, లక్ష్మి బుయ్యాని, నీరజ సామిడి, సంకీర్త ముక్క, శ్రుతి సూదిని, రష్మి కట్పల్లి, షర్మిల మేకల, సింధూర పల్రెడ్డి, సత్య బానోత్, సంధ్య కే, అనిత బండి, సుస్మిత జువ్వాడి, దీపిక వనమాల, మీన కలికోట, అనుపమ దోమ, స్వప్న కరివేడ, ప్రీతి రాచర్ల, అనూష గుండ, ఝాన్సీ జోగు, రేవతి ముంద్రాతి, దివ్య అవ్వారు, శ్వేత వంగల, సమత తెల్లపెల్లి, ప్రసన్న కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA)సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, ట్రెజరర్ సుధీర్ ముద్దసాని, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమరేంద్ర నంది, సంపత్ దేశినేని, సత్యజిత్ మారెడ్డి, స్టాండింగ్ కమిటి చైర్‌ శ్రీకాంత్ పొట్టి, ఇంటెర్నేషనల్ కో-ఆర్డినేటర్ నర్సి దోమ, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు ప్రవీణ్ పల్రెడ్డి, కోట్య బానోత్, క్రిష్ణకాంత్ కుచలకంటి, కిరణ్ ఉట్కూరి, రాము ముండ్రాతి, సెక్రెటరి శ్రీధర్ బండి, రఘు జువ్వాడి, ఎగ్జిక్యూటివ్ కమిటి టీం సంతోష్ సోమిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి బోబ్బా, వినోద్ పల్లె, శశి యాదవ్, కిరణ్ తెల్లపల్లి, అజయ్ కుండీకుఫుల్ల, అమర్ అతికం, వెంకట్ దండ, దేవేందర్ మండల, రఘు పాల్రెడ్డి, సతీష్ చింతకుంట, తరుణ్ పొట్టిగారి, డా.సుమన్ మంచిరెడ్డి, శ్రీని జూపల్లి, మీడియా చైర్ ఈశ్వర్ బాండ, మధు యనగంటి, రుక్మేష్ కుమార్ పూల, వరుణ్ కుసుమ, ప్రవీణ్ ఆలెటి, కమలాకర్ నల్లాల, వెంకట్ చిలంపల్లి, క్రిష్ణ రమావత్, కిరణ్ బైరెడ్డి, ప్రసాద్ కంచర్ల, వేణు కే,శ్రీధర్ పాడురి, భాస్కర్ చల్ల, రఘువీర్, కిరణ్ వి, శ్రవంత్ గుండా, రాఘవేందర్ బుయ్యాని, రఘు జూలకంటి, సంతోష్ కుమార్, అనిల్ నక్క, వెంకట్ మందడి, చారుహాసిని గోకరాజు, నవీన్ హరి, జయచంద్ర చెరుకూరి, గణేష్ ముక్క హాజరయ్యారు.

గ్లోబల్ తెలంగాణా అసోసియేషన్ (GTA) సంస్థ చైర్మన్ విశ్వేశ్వర కలువల, ఉపాధ్యక్షులు శ్రవణ్ పాడూరు, వాషింగ్టన్ డీసీ అధ్యక్షులు తిరుమల్ మునుకుంట్ల మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకల్లో ప్రవాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) వాషింగ్టన్ డీసీ వారు నిర్వహించిన మొదటి సద్దుల బతుకమ్మ & దసరా సంబరాలను బతుకమ్మ చరిత్రలో ఇంతకుముందెన్నడూ జరగని విధంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం కావడానికి తోడ్పడిన మహిళలు, రెస్టారెంట్స్, బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్, స్పాన్సర్స్, వాలంటీర్స్, పోలీస్ సిబ్బంది, స్కూల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యావాదాలు తెలియజేశారు.

Updated Date - 2023-11-03T07:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising