UAE: యూఏఈలో వర్షం.. వేసవి తాపం నుంచి జనాలకు ఉపశమనం
ABN, First Publish Date - 2023-05-21T13:32:55+05:30
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. వేసవి తాపం నుంచి జనాలకు ఉపశమనం లభించింది. అటు పర్వతాలపై వర్షం కురిసి, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. జలపాతాల మాదిరి వరదలు పారుతుండడం చూసి జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుత ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే వాహనదారులు సైతం రోడ్లపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. ముఖ్యంగా సైన్‌బోర్డులపై ప్రదర్శించబడే వేగ పరిమితులకు లోబడి డ్రైవ్ చేయాలని ట్రాఫిక్ పోలీస్ విభాగం (Traffic Police Department) పేర్కొంది. ఇక ఊహించని విధంగా వర్షాలు మొదలైన నేపథ్యంలో జాతీయ వాతావరణ కేంద్రం పలు ప్రాంతాలకు సంబంధించిన వర్షపు వీడియోలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
WhatsApp: ఎల్లలు దాటిన వాట్సాప్ సందేశం.. ఆఫ్రికాలో ఉన్న తండ్రికి తెలుగునాట తప్పిపోయిన బిడ్డ ఆచూకీ తెలిసిందిలా..
Updated Date - 2023-05-21T13:32:55+05:30 IST