ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mukarram Jah: చివరి నిజాం నవాబు ముకర్రం జా కన్నుమూత

ABN, First Publish Date - 2023-01-15T18:17:42+05:30

హైదరాబాద్ చివరి నిజాం నవాబు ముకర్రం జా శనివారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా విదేశాల్లో ఉంటున్న ఆయన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విదేశాలలో జన్మించి జీవితామంతా అక్కడే గడిపి, కన్నుమూసిన చివరి నిజాం

  • బంజారాహిల్స్‌లో 400 ఎకరాల ప్యాలెస్ నుండి రెండు గదుల ఫ్లాట్ వరకు జీవన ప్రయాణం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: హైదరాబాద్ చివరి నిజాం నవాబు ముకర్రం జా(Mukarram Jha Bahadur) శనివారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా విదేశాల్లో ఉంటున్న ఆయన టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో కన్నుమూశారు. ఆయన కోరిక మేరకు హైదరాబాద్‌లో మంగళవారం అంతిమ సంస్కారం చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో వీలినమయ్యె వరకు పరిపాలించిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మనుమడైన ముకర్రం జాను 1971లో రాజాభరణాలను రద్దయ్యే వరకు 8వ నిజాం నవాబుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్‌కు ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరిపై కూడా తండ్రికి విశ్వాసం లేకపోవడంతో పెద్ద కొడుకు కుమారుడైన ముకర్రం జాను 1954లో తన వారసుడిగా ప్రకటించారు. దీన్ని కేంద్ర సర్కారు గుర్తించింది. 1977 నాటి అత్యవసర పరిస్థితిలో సంజయ్ గాంధీతో వివాదం కారణాన జోధ్ పూర్ రాణి గాయత్రి దేవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో దేశం విడిచి అస్ట్రేలియాకు ముకర్రం జా ఆస్ట్రేలియాకు వెళ్ళారు. అటుపై టర్కీకు వెళ్ళి అక్కడే దాదాపు జీవితమంతా గడిపారు.

తన తల్లి కారణంగా జోర్డాన్, సౌదీ అరేబియా రాజకుటుంబాలతో బంధుత్వం కలిగిన ముక్రం జా డూన్ స్కూల్ లో, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో పాటు విశ్వఖ్యాత రాయల్ మిలిటరీ అకాడమీలో కూడ విద్యనభ్యసించిన ఆయన నివాసం బంజారాహిల్స్ లో 400 ఎకరాలలో ఉన్న ప్రస్తుత కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్కుగా ఉన్న చిరాన్ ప్యాలెస్. దక్షిణ టర్కీలో మధ్యధార సముద్ర తీరంలో ఒక రెండు గదుల ఫ్లాట్ లో ఆయన గడిపారు. ముంబాయిలో ముఖ్యమంత్రి అధికార నివాసం ఎదురుగా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు సౌదీ అరేబియా దేశాలలో కూడ ఆయనకు ఖరీదయిన ఆస్తులు ఉన్నాయి.

నాలుగు సార్లు వివాహం చేసుకున్న ముక్రం జా అస్ట్రేలియాకు చెందిన తన రెండవ భార్య హెలన్‌కు విడాకులిచ్చేందుకు హైదరాబాద్‌లోని తన పూర్వీకుల ఆస్తిలో పెద్ద మొత్తాన్ని విక్రయించారు. టర్కీ, మొరాకో దేశాలకు చెందిన మరో ముగ్గురిని కూడా ఆయన వేర్వేరుగా వివాహం చేసుకున్నారు.

హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్‌తో పాటు ఇతర ఆస్తుల వ్యవహారాలను కూడా ఆయన మొదటి భార్య టర్కీకి చెందిన ఎస్రా పర్యవేక్షిస్తుంటారు. కేసీఆర్‌తో పాటు గతంలో పని చేసిన అనేక మంది ముఖ్యమంత్రులతో ఎస్రా సమావేశమయ్యారు. ఫ్రాన్స్‌లో సంపన్నులు నివసించే నీస్‌లో జన్మించిన ముకర్రం జా తనకు తన పూర్వీకుల మాతృభూమిలోనే అంతిమ సంస్కారాలు చేయాలని కోరారు.

Updated Date - 2023-01-15T18:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising