ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Golden Visa: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. టాలీవుడ్‌ తొలి హీరోగా రికార్డ్!

ABN, First Publish Date - 2023-01-20T11:03:01+05:30

దుబాయ్ ప్రభుత్వం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Icon Star Allu Arjun) అరుదైన గౌరవం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Golden Visa: దుబాయ్ ప్రభుత్వం నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Icon Star Allu Arjun) అరుదైన గౌరవం దక్కింది. తాజాగా బన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి గోల్డెన్ వీసా (Golden Visa) అందుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ దుబాయ్ అధికారితో కలిసి ఉన్న ఫొటోతో పాటు దుబాయ్ నగరం ఫొటోను షేర్ చేశాడు. "ఒక మంచి అనుభూతిని ఇచ్చినందుకు దుబాయ్‌కు ధన్యవాదాలు. గోల్డెన్ వీసా ఇచ్చినందుకు థ్యాంక్స్. త్వరలో మళ్ళీ కలుద్దాం" అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ (Tollywood) తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు.

కాగా, ఇప్పటికే పలువురు మలయాళ, బాలీవుడ్ స్టార్స్ యూఏఈ గోల్డెన్ వీసా పొందిన విషయం విదితమే. వీరిలో బాలీవుడ్‌కు చెందిన షారూక్ ఖాన్, సంజయ్‌దత్, సునీల్ షెట్టి, బోనీ కపూర్ ఫ్యామిలీ, సంజయ్ కపూర్, ఊర్వశి రౌతేలా, ఫరా ఖాన్ కుందన్, సోను నిగమ్, వరుణ్ ధావన్‌ ఉన్నారు. అలాగే మలయాళం నుంచి మోహన్‌లాల్, మమ్ముటీ, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఉన్నారు. వీరితో పాటు నటి త్రిషా, సీనియర్ గాయని కేఎస్ చిత్ర, క్రీడాకారిణి సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. అలాగే కొణిదేల వారి కోడలు, నటుడు రాంచరణ్ సతీమణి ఉపాసన సైతం ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో ఉన్నారు.

అసలు ‘గోల్డెన్ వీసా’ ప్రయోజనాలేమిటీ?

ఈ గోల్డెన్ వీసాను పొందే వ్యక్తులు యూఏఈ రాజధాని అబుదాబీ లేదా దుబాయ్ తదితర ఎమిరేట్స్‌లో పదేళ్ల వరకు నివసించే వెసులుబాటు ఉంటుంది. విదేశీయులకు లాంగ్‌టర్మ్ రెసిడెన్సీకి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో యూఏఈ సర్కార్ 2019లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే గోల్డెన్ వీసాలను ప్రవేశపెట్టింది. అంతేగాక ఈ వీసా ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది. ఇక ఈ వీసా కలిగిన వ్యక్తులు తమ భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అబుదాబీలో పదేళ్లు నివసించవచ్చు. గోల్డెన్ వీసా హోల్డర్లు వంద శాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఈ వీసాను పొందడం సామాన్యులకు సాధ్యం కాదు. 2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే.. వారికి ఎంతో పాపులారిటీ ఉంటేనే ఈ వీసాకు అర్హత సాధిస్తారు.

Updated Date - 2023-01-20T14:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising