Henley Passport Index 2023: మెరుగైన భారత పాస్‌పోర్ట్ ర్యాంక్.. ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చంటే..
ABN, First Publish Date - 2023-07-19T10:40:48+05:30
తాజాగా విడుదలయిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 (Henley Passport Index 2023) లో భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంక్ మెరుగయింది.
Henley Passport Index 2023: తాజాగా విడుదలయిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 (Henley Passport Index 2023) లో భారతీయ పాస్‌పోర్ట్ ర్యాంక్ మెరుగయింది. ఈ ఏడాది ప్రారంభంలో 85వ స్థానంలో ఉన్న భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 80వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం భారత పాస్‌పోర్టుతో 57 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణం చేసే వెసులుబాటు ఉంది. ఇక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా (World’s Most Powerful Passport) సింగపూర్ పాస్‌పోర్ట్ నిలిచింది. ఈ పాస్‌పోర్టుతో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాల పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. వీటితో 190 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణాలు చేయవచ్చు. కాగా, ఈ ఏడాది స్టార్టింగ్‌లో మొదటి స్థానంలో ఉన్న జపాన్ పాస్‌పోర్ట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పరిమితమైంది. జపాన్‌తో పాటు ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, లక్సెంబర్గ్, స్వీడెన్ మూడో ర్యాంకులో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టుతో 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు ఉంది. ఇలా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన టాప్-10 పాస్‌పోర్టు జాబితాను పరిశీలిస్తే..
1. సింగపూర్ (192 గమ్యస్థానాలు)
2. జర్మనీ/ ఇటలీ/ స్పెయిన్ (190 గమ్యస్థానాలు)
3. జపాన్/ ఆస్ట్రియా/ ఫిన్లాండ్/ ఫ్రాన్స్/ దక్షిణ కొరియా/ లక్సెంబర్గ్/ స్వీడెన్ (189 గమ్యస్థానాలు)
4. డెన్మార్క్/ ఐర్లాండ్/ నెదర్లాండ్స్/ యూకే (188 గమ్యస్థానాలు)
5. బెల్జియం/ చెక్ రిపబ్లిక్/ మాల్టా/ న్యూజిలాండ్/ నార్వే/ పోర్చుగల్/ స్విట్జర్లాండ్ (187 గమ్యస్థానాలు)
6. ఆస్ట్రేలియా/ హంగేరి/ పోలాండ్ (186 గమ్యస్థానాలు)
7. కెనడా/ గ్రీస్ (185 గమ్యస్థానాలు)
8. లిథువేనియా/ యూఎస్ (184 గమ్యస్థానాలు)
9. లాట్వియా/ స్లోవేకియా/ స్లోవేనియా (183 గమ్యస్థానాలు)
10. ఎస్టోనియా/ ఐస్లాండ్ (182 గమ్యస్థానాలు)
వరల్డ్‌లోనే టాప్-10 చెత్త పాస్‌పోర్ట్స్ ఇవే..
103. ఆఫ్ఘనిస్తాన్ (27 గమ్యస్థానాలు)
102. ఇరాక్ (29 గమ్యస్థానాలు)
101. సిరియా (30 గమ్యస్థానాలు)
100. పాకిస్తాన్ (32 గమ్యస్థానాలు)
99. యెమెన్/ సోమాలియా (35 గమ్యస్థానాలు)
98. నేపాల్/ పాలస్తీనా భూభాగం (38 గమ్యస్థానాలు)
97. ఉత్తర కొరియా (39 గమ్యస్థానాలు)
96. బంగ్లాదేశ్ (40 గమ్యస్థానాలు)
95. శ్రీలంక/ లిబియా (41 గమ్యస్థానాలు)
94. కొసావో (42 గమ్యస్థానాలు)
Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?
Updated Date - 2023-07-19T13:12:02+05:30 IST