ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YouTube New CEO: యూట్యూబ్ పగ్గాలు కూడా మనోడికే.. వెలిగిపోతున్న భారత్‌ ప్రభ!

ABN, First Publish Date - 2023-02-18T12:13:01+05:30

సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భారత్‌ ప్రభ వెలిగిపోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: సాంకేతికత, ఆవిష్కరణల రంగంలో భారత్‌ ప్రభ వెలిగిపోతోంది. ఇప్పటికే భారత సంతతికి చెందిన పలువురు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ సంస్థలకు అధిపతులుగా కొనసాగుతున్నారు. భారతీయుల ప్రతిభను గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు వారిని అందలం ఎక్కిస్తున్నాయి. వారిలో అల్ఫాబెట్-గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ బాస్‌ సత్య నాదేళ్ల, అడోబ్ సీఈ శంతను నారాయణ్, ఐబీఎం సీఈఓ అరవింద్‌ కృష్ణ ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మరో భారతీయ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) చేరారు. ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌, వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్‌కు కొత్త సీఈవోగా (YouTube New CEO) నీల్ మోహన్ నియమితులయ్యారు. గత దశాబ్ధ కాలంగా ఈ పదవిలో కొనసాగుతున్న సుసాన్ ఒజిసికి (Susan Wojcicki) రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఆమె స్థానంలో మోహన్‌ను కొత్త సీఈఓగా నియమించారు.

ప్రస్తుతం ఆయన యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2008లో ఆయన గూగుల్ సంస్థలో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలం మైక్రోసాప్ట్‌లో (Microsoft) కూడా పని చేశారు. ఇక సుసాన్ ఒజిసికి, మోహన్ ఇద్దరూ కలిసి సుమారు 15 ఏళ్లపాటు కలిసి పని చేశారు. ఈ క్రమంలో ఆయన 2015లో యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ బాస్ అయ్యారు. ఈ సందర్భంగా యూట్యూబ్ సీఈఓగా బాధ్యతలు చేపట్టనున్న నీల్ మోహన్‌కు గూగుల్ సీఈఓ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కాగా, యూట్యూబ్‌ కూడా ఆల్ఫాబెట్‌ గ్రూప్‌ సంస్థే. గూగుల్‌తోపాటు ఆల్ఫాబెట్‌కు భారత వ్యక్తి సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ గ్రూప్‌నకు ఆదాయపరంగా చాలా కీలకమైన యూట్యూబ్‌ పగ్గాలు కూడా భారత సంతతి వ్యక్తికే లభించడం విశేషం.

ఇది కూడా చదవండి: ఎవరీ వివేక్ రామస్వామి..? అన్నీ కలిసొస్తే అమెరికా అధ్యక్షుడిని అవుతానంటున్న ఈ ఎన్నారై బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..

Updated Date - 2023-02-18T12:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising