ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Heartbroken: అయ్యో పాపం.. పదేళ్ల తర్వాత కొడుకును వెతుక్కుంటూ యూఏఈ వెళ్లిన భారతీయ దంపతులు.. చివరికి

ABN, First Publish Date - 2023-08-10T09:18:07+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉంటున్న కుమారుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన భారతీయ దంపతులకు నిరాశే ఎదురైంది. రోజుల తరబడి వెతికినా తర్వాత కొడుకు ఆచూకీ తెలిసింది.

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉంటున్న కుమారుడి కోసం వెతుక్కుంటూ వెళ్లిన భారతీయ దంపతులకు నిరాశే ఎదురైంది. రోజుల తరబడి వెతికినా తర్వాత కొడుకు ఆచూకీ తెలిసింది. కానీ, అతడు మృతిచెందాడని తెలుసుకుని గుండెలవిసేలా విలపించారు. పదేళ్లుగా తమ కుమారుడిని చూడని భారతీయ దంపతులు ఇప్పుడు అతని మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. 10ఏళ్ల క్రితం నిశ్చితార్థం వరకు వచ్చి పెళ్లి ఆగిపోవడంతో అతడు స్వగ్రామంలో ఉండలేక.. విదేశాలకు పయనమయ్యాడు. అలా యూఏఈ (UAE) వచ్చి పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అప్పటి నుంచి తల్లిదండ్రులు అతనికి స్వదేశానికి వచ్చేయాలని చాలాసార్లు బతిమాలాడారు. కానీ, అతడు ససేమీరా అన్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల నుంచి కుమారుడితో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దాంతో ఆందోళన చెందిన భారతీయ దంపతులు (Indian Couple) కొడుకును వెతుక్కంటూ యూఏఈ వెళ్లారు.

కొన్ని రోజులు వెతికినా తర్వాత అతని చిరునామా తెలుసుకున్నారు. చివరికెళ్లి ఎంతో ఆశగా కుమారుడి ఇంటి తలుపుతట్టారు. కానీ, అతడు చనిపోయాడనే విషయం తెలుసుకుని బోరున విలపించారు. ఒంటరిగా జీవించడం, ఎవరితోనూ పెద్దగా పరిచయం లేని కారణంగా చాలా రోజుల వరకు అతడి మృతదేహాన్ని ఎవరూ గుర్తించలేదు. దాంతో ఆ పేరెంట్స్ (Parents) మార్చురీకి వెళ్లి కుమారుడి మృతదేహాన్ని గుర్తించారు. అక్కడి అన్ని పార్మాలిటీలు పూర్తి చేసిన తర్వాత, అతని మృతదేహాన్ని ఇండియాకు తరలించడం జరిగింది. దీనికి సామాజిక కార్యకర్త అష్రఫ్ తామరస్సేరి భారతీయ దంపతులకు సహకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "చిన్నపాటి మనస్పర్థల కారణంగా సదరు వ్యక్తి పదేళ్ల క్రితం తన స్వగ్రామానికి దూరమయ్యాడు. ఆ తర్వాత అతను తిరిగి తన స్వస్థలానికి వెళ్లలేదు. కుమారుడు ఇకలేడు అని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు రోదించిన తీరును నేను ఎప్పటికీ మరిచిపోలేను. నేను చూసిన అత్యంత హృదయ విదారక కేసుల్లో ఇది ఒకటి" అని చెప్పుకొచ్చారు.

UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. ఇకపై అలా చేశారో రోజుకు రూ.1100 జరిమానా..!

Updated Date - 2023-08-10T09:18:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising