Indian Embassy: కువైత్‌లోని భారత ప్రవాసులకు ముఖ్య గమనిక.. ఈ నెల 31వ తేదీన తప్పనిసరిగా..
ABN, First Publish Date - 2023-03-21T09:47:37+05:30
కువైత్‌లోని ప్రవాసులకు భారత ఎంబసీ (Indian Embassy) కీలక సూచన చేసింది.
కువైత్ సిటీ: కువైత్‌లోని ప్రవాసులకు భారత ఎంబసీ (Indian Embassy) కీలక సూచన చేసింది. ఈ నెల 31వ తేదీన 'కాన్సులర్ క్యాంప్' (Consular Camp) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. జాహ్రాలో (Jahra) నిర్వహించే ఈ క్యాంప్ ప్రత్యేకంగా కువైత్‌లోని భారత ప్రవాసులకు (Indian Embassy) ఉపయోగకరంగా ఉంటుందని ఎంబసీ వెల్లడించింది. జాహ్రాలోని వాహా ప్రాంతంలో డోడీ కిడ్స్ నర్సరీ, బ్లాక్-02, స్ట్రీట్ నం.06, హౌస్-02లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందని తెలియజేసింది.
ఇక క్యాంప్ ద్వారా ప్రవాసులకు పాస్‌పోర్ట్ రెన్యువల్(ఆన్‌లైన్ ఫారమ్ ఫిల్లింగ్, ఫోటోగ్రాఫ్), రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర ముఖ్యమైన సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయని ఎంబసీ అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ క్యాంప్‌లోనే అదే రోజు కావాల్సిన ధృవపత్రాలను జారీ చేయడం జరుగుతుంది. కనుక ధృవపత్రాల కోసం మళ్లీ ఎంబసీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక ఈ సర్వీసులు పొందేందుకు కేవలం క్యాష్ పేమెంట్లు (Cash Payments) మాత్రం స్వీకరించడం జరగుతుందని రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రవాసులను (Indian Embassy) ఎంబసీ కోరింది.
ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!
Updated Date - 2023-03-30T11:20:36+05:30 IST