Dubai: నిజాయితీ చాటిన భారతీయుడు.. రూ. 30లక్షలు అప్పగింత!
ABN, First Publish Date - 2023-01-09T10:40:39+05:30
నిజాయితీ చాటిన భారత వ్యక్తిని (Indian) తాజాగా దుబాయ్ పోలీసులు (Dubai Police) సన్మానించారు.
దుబాయ్: నిజాయితీ చాటిన భారత వ్యక్తిని (Indian) తాజాగా దుబాయ్ పోలీసులు (Dubai Police) సన్మానించారు. బహిరంగ ప్రదేశంలో తనకు దొరికిన 1.34లక్షల దిర్హమ్స్ (రూ.30లక్షలు)ను భారత ప్రవాసుడు (Indian Expat) ఉపేంద్రనాథ్ చతుర్వేది అల్ రఫ్పా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. దీంతో పోలీసులు అతడి నిజాయితీని మెచ్చుకుని ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉపేంద్ర నిజాయితీని ప్రశంసించిన దుబాయ్ పోలీసులు అతడిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర నిజాయితీని అల్ రఫ్పా పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ మహమ్మద్ బిన్ అహ్మద్ మెచ్చుకున్నారు.
అలాగే భారత ప్రవాసుడికి ప్రశంసాపత్రాన్ని కూడా అందజేశారు. దాంతో తనకు దక్కిన ఈ ప్రత్యేక గుర్తింపు పట్ల ఉపేంద్ర ఆనందం వ్యక్తం చేస్తూ దుబాయ్ పోలీసులకు ధన్యవాదాలు (Thanks) తెలియజేశాడు. ఇది తనకు, తన దేశ పౌరులకు గర్వకారణమని అన్నారు. ఇక యూఏఈలో పోగొట్టుకున్న విలువైన వస్తువులు, నగదును అప్పగించే నిజాయితీగల నివాసితులను అక్కడి అధికారులు ప్రత్యేకంగా సత్కరిస్తుంటారు. ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిలో గతేడాది జూన్‌లో ఓ భారతీయ వ్యక్తికి సంబంధించిన ఘటన ఒకటి. భారత ప్రవాసుడు తారిఖ్ మహ్మద్ ఖలీద్ మహమూద్ తన భవనంలోని ఎలివేటర్‌లో 1 మిలియన్ దిర్హమ్స్(రూ.2.24కోట్లు) నగదు దొరకగా దాన్ని నిజాయితీగా పోలీసులకు అప్పగించాడు.
Updated Date - 2023-01-09T10:40:40+05:30 IST