Most Expensive Villa: దుబాయిలో ఓ భారతీయ ఫ్యామిలీ కొన్న.. ఈ విలాసవంతమైన విల్లా ఖరీదు తెలిస్తే..
ABN, First Publish Date - 2023-02-11T10:03:50+05:30
లగ్జరీ ప్రాపర్టీలకు భారీ డిమాండ్ ఉన్న దుబాయిలో ఇటీవల ఓ భారతీయ కుటుంబం (Indian Family) ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది.
దుబాయి: లగ్జరీ ప్రాపర్టీలకు భారీ డిమాండ్ ఉన్న దుబాయిలో ఇటీవల ఓ భారతీయ కుటుంబం (Indian Family) ఖరీదైన విల్లాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. తిలాల్ అల్ ఘఫ్‌లో (Tilal Al Ghaf) ఈ విల్లాను కొనుగోలు చేసింది. ఆ విల్లా విలువ అక్షరాల 90.5మిలియన్ల దిర్హమ్స్. మన భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.213కోట్లకు పైమాటనే. ఈ మేరకు మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్ (Metropolitan Premium Properties) తాజాగా వెల్లడించింది. 30,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఉబెర్-లగ్జరీ విల్లాను కెల్లీ హోపెన్ ఇంటీరియర్ డిజైనింగ్ అవార్డు విన్నింగ్ ఆర్కిటెక్ సంస్థ సవోటా(SAOTA) నిర్మించింది. మూడు అంతస్తులు ఉండే ఈ విల్లా చాలా ప్రత్యేకతలు కలిగి ఉంది. మూడు స్విమ్మింగ్ పూల్స్, జిమ్, రిసెప్షన్, 24/7 సెక్యురిటీ, ప్రత్యేక గెస్ట్ గౌస్ ఇలా ఇతర సౌకర్యాలు దీని సొంతం. అలాగే విశాలమైన 8 బెడ్ రూమ్స్‌తో దీన్ని కట్టారు. ఇక ఇలాంటి విల్లాను పామ్ జుమేరాలో కొనాలంటే కనీసం 250 మిలియన్ దిర్హమ్స్ చెల్లించాల్సి ఉంటుందని మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్ సేల్స్ మేనేజర్ ఒబేయక్ శంసిద్దినోవ్ (Oybek Shamsiddinov) తెలిపారు.
కాగా, తిలాల్ అల్ ఘఫ్ అనేది దుబాయిలో మజిద్ అల్ ఫుట్టైం (Majid Al Futtaim) డెవలప్ చేసిన గెటేడ్ కమ్యూనిటీ. ఇందులో స్కూళ్లు, ఆస్పత్రులు, రెస్టారెంట్లు, ఇతర గృహసదుపాయాలతో ఏకంగా 3.50లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఇక తాజా ఇండియన్ ఫ్యామిలీ ఖరీదైన విల్లా కొనుగోలు ఒప్పందం అనేది అధిక నాణ్యత గల దుబాయి గృహాలకు పెరుగుతున్న డిమాండ్‌కు నిదర్శనమని మెట్రోపాలిటన్ ప్రీమియం ప్రాపర్టీస్ సీఈఓ నికితా కుజ్నెత్సోవ్ పేర్కొన్నారు. వాటర్‌ఫ్రంట్ ప్రాపర్టీస్ కొనుగోలుకు పెట్టుబడిదారులు అమితాసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. కాగా, తిలాల్ అల్ ఘఫ్ (Tilal Al Ghaf) ఉన్న లానాయ్ ద్వీపం అనేది ప్రైవేట్ ద్వీపాలలో ఒకటి. ఇందులో 13 విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. వీటిలో 9 తీర భవనాలు కాగా, 4 ఎడ్జ్ మ్యాన్షన్స్ ఉన్నాయి. ఇదో భూతల స్వర్గమని అక్కడివారు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో..
Updated Date - 2023-02-11T10:43:54+05:30 IST