Indian Missing: కువైత్‌లో నెల రోజుల క్రితం కనిపించకుండాపోయిన భారతీయుడు.. చివరికి విషాదాంతం..!
ABN, First Publish Date - 2023-02-14T07:54:21+05:30
పొట్టకూటి కోసం కువైత్ (Kuwait) వెళ్లిన ఓ భారత వ్యక్తి (Indian Man) నెల రోజుల క్రితం ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు (Missing).
కువైత్ సిటీ: పొట్టకూటి కోసం కువైత్ (Kuwait) వెళ్లిన ఓ భారత వ్యక్తి (Indian Man) నెల రోజుల క్రితం ఉన్నట్టుండి కనిపించకుండాపోయాడు (Missing). దాంతో స్వదేశంలోని కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం భారత ఎంబసీని (Indian Embassy) సంప్రదించారు. అక్కడి ఓ భారతీయ సామాజిక సంస్థ కూడా అతడి ఫ్యామిలీ మెంబర్స్‌కు సహకరించింది. సరిగ్గా నెల రోజుల తర్వాత అతడి ఆచూకీ కనుగొన్నారు. అది కూడా ఓ ఆస్పత్రిలోని మార్చురీలో. ఈ విషయం తెలిసిన అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంబసీ సహాయంతో సామాజిక కార్యకర్తలు అతడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించారు. అసలు భారతీయుడి విషయంలో ఏం జరిగింది? నెల రోజుల క్రితం కనిపించకుండాపోయిన అతడు ఎలా చనిపోయాడు? అనే వివరాలను కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఎంబసీ తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడులోని (Tamil Nadu) కడలూర్ జిల్లాకు చెందిన సురేష్ కుమార్ సెల్వరాజ్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం కువైత్ వెళ్లాడు. అక్కడ పనిచేసి వచ్చిన సంపాదనను స్వదేశంలోని కుటుంబ సభ్యులకు పంపిస్తు్న్నాడు. ఈ క్రమంలో జనవరి 9 నుంచి కుటుంబ సభ్యులకు సురేష్ నుంచి ఎలాంటి ఫోన్‌కాల్స్ రాలేదు. అతడిని కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించిన కుదరలేదు. దాంతో కుటుంబ సభ్యులు అక్కడే పని చేస్తున్న సురేష్ తోటి స్నేహితులను సంప్రదించారు. తోటి కార్మికులు ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త మాథినికి చెప్పారు. మాథి సాయంతో మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే రంగంలోకి దిగిన ఎంబసీ అధికారులు సురేష్ ఆచూకీ కోసం దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులలో వాకాబు చేయించారు.
ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఈ భారతీయుడిదే.. 2నెలల కింద 1కిలో గోల్డ్.. మళ్లీ ఇప్పుడేమో.
ఈ క్రమంలో సాల్మియాలోని ఆస్పత్రిలో సురేష్ మృతదేహాన్ని గుర్తించారు. జనవరి 9న సాల్మియా పరిధిలోని బల్జత్ స్ట్రీట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. వారిలో సురేష్ కూడా ఒకరు. ఓ కారు ప్రమాదంలో వారు చనిపోయారు. అప్పటి నుంచి సురేష్ కనిపించకుండాపోయాడు. ఎక్కడో ప్రాణాలతోనే ఉండి ఉంటాడు, తిరిగి వస్తాడు అని ఆశతో ఉన్న కుటుంబ సభ్యులకు ఇలా తీరని శోకాన్ని మిగిల్చాడు. అక్కడి ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఎంబసీ సహాయంతో సామాజిక కార్యకర్తలు మాథి, అలీభాయ్.. సురేష్ మృతదేహాన్ని ఫిబ్రవరి 10న స్వదేశానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో సురేష్ స్వస్థలంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇలాంటివారు చాలా అరుదు.. సొంతూరి కోసం ఎన్నారై ఏకంగా రూ.1.10కోట్ల వ్యయంతో.. కార్పొరేట్ స్థాయిలో..
Updated Date - 2023-02-14T07:54:23+05:30 IST