Kuwait: భారతీయురాలు ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా జరిగిందో విషాదం..!
ABN, First Publish Date - 2023-01-31T09:38:40+05:30
కువైత్‌లో (Kuwait) పనిచేసే చోట నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ భారతీయ మహిళ (Indian Woman) ప్రాణాలు కోల్పోయింది.
కువైత్ సిటీ: కువైత్‌లో (Kuwait) పనిచేసే చోట నుంచి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఓ భారతీయ మహిళ (Indian Woman) ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల 28న (శనివారం) అను అబెల్ (Anu Abel) అనే 34 ఏళ్ల భారతీయులురాలు తాను పనిచేసే ఆఫీస్ నుంచి సాయంత్రం తిరిగి ఇంటికి పయనమైంది. ఈ క్రమంలో మధ్యలో ఓ రోడ్డు క్రాస్ చేస్తుండగా అటువైపుగా వేగంగా దూసుకొచ్చిన ఓ వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అను తీవ్రంగా గాయపడింది.
దాంతో వెంటనే ఆమెను చికిత్స కోసం హూటాహూటిన సమీపంలోని ఫర్వానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది. తీవ్రమైన రక్తస్రావం కారణంగా ఆమె చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, అను ప్రస్తుతం లూలూ ఎక్స్‌ఛేంజ్‌లో కస్టమర్ కేర్ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు తెలిసింది. కేరళ రాష్ట్రం కొట్టారక్కరకు చెందిన ఆమెకు భర్త అబెల్ రాజన్, తొమ్మిదేళ్ల కుమారుడు హరాన్ అబెల్ ఉన్నారు. ఈ ఘటనతో ఆమె స్వస్థలం కొట్టారక్కరలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Updated Date - 2023-01-31T09:40:13+05:30 IST