ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian travellers: ఒమాన్‌లో భారతీయ ప్రయాణీకుల సరికొత్త రికార్డు.. ఇంతకుముందెన్నడూ లేని విధంగా..

ABN, First Publish Date - 2023-03-05T08:08:57+05:30

నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (National Center for Statics and Information) ప్రకారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (National Center for Statics and Information) ప్రకారం.. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా ఎక్కువగా రాకపోకలు జరిపిన ప్రయాణీకుల జాబితాలో భారతీయ ప్రయాణీకులు (Indian travellers) అగ్రస్థానంలో నిలిచారు. డిసెంబర్ 2022 నాటికి 1.47లక్షల కంటే ఎక్కువ మంది భారతీయ ప్రయాణీకులు మస్కట్ (Muscat International Airport) విమానాశ్రయం ద్వారా ప్రయాణించడం జరిగింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (53,130), పాకిస్థాన్ (39,853) ఉన్నాయి. ఇక గతేడాది మస్కట్, సలాలా, సోహార్ ఎయిర్‌పోర్టుల ద్వారా రాకపోకలు కొనసాగించిన అంతర్జాతీయ విమానాల సంఖ్య ఏకంగా 128శాతం పెరగడం గమనార్హం.

2022 చివరి నాటికి ఏకంగా 65వేలకు పైగా ఇంటర్నేషనల్ విమాన సర్వీసులు నడిచాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి ఇది కేవలం 28,580గా మాత్రమే ఉంది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఎయిర్‌పోర్టుల (Airports of the Sultanate of Oman) ద్వారా వచ్చేవారి సంఖ్య గణనీయంగా 133 శాతం మేర పెరిగింది. అలాగే డిపార్చర్ల సంఖ్య కూడా గత డిసెంబర్ చివరి వరకు 109 శాతం పెరిగింది. ఇక గతేడాది చివరినాటికి మస్కట్, సలాలా, సోహార్, దుక్మ్ విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించిన ప్రయాణీకుల మొత్తం సంఖ్య 9,876,762కి చేరింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించిన అంతర్జాతీయ, దేశీయ విమానాల సంఖ్య 107శాత పెరిగింది. 68,737 విమాన సర్వీసుల ద్వారా 8,602,792 మంది ప్రయాణించారు. అటు సలాలా విమానాశ్రయం ద్వారా 11,28,024 మంది, సోహార్ ఎయిర్ పోర్టు ద్వారా 78,482 మంది, దుక్మ్ విమానాశ్రయం ద్వారా 67,465 మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది.

ఇది కూడా చదవండి: మీకు టూరిస్ట్ వీసా ఉంటే చాలు.. కెనడాలో రెండేళ్లు ఎంచక్కా పని చేసుకోవచ్చు..!

Updated Date - 2023-03-05T08:08:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising