ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UAE: భారతీయులకు గుడ్‌న్యూస్.. ఇకపై వారంలోని 7రోజులు వీసా, పాస్‌పోర్ట్ సేవలు

ABN, First Publish Date - 2023-01-28T09:36:40+05:30

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని భారత ప్రవాసులకు (Indian Expats) నిజంగా ఇది గుడ్‌న్యూస్ (Good News) అనే చెప్పాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని భారత ప్రవాసులకు (Indian Expats) నిజంగా ఇది గుడ్‌న్యూస్ (Good News) అనే చెప్పాలి. ఇకపై మనోళ్లకు వారంలోని ఏడు రోజు కూడా వీసా, పాస్‌పోర్ట్ సర్వీసులు (Passport Services) అందుబాటులో ఉండనున్నాయి. ఆదివారాలు (Sundays) కూడా ఇకపై సంబంధిత కార్యాలయాలు తెరిచే ఉంటాయని, వారంలోని మిగతా రోజుల మాదిరిగానే ఇక్కడ దరఖాస్తుల సమర్పణ, ప్రాసెస్ ఉంటుంది. దీనిలో భాగంగా పాస్‌పోర్ట్, వీసా సంబంధిత సేవల కోసం దరఖాస్తులు సమర్పించడానికి ఇండియన్ ఔట్‌సోర్సింగ్ సర్వీస్ ప్రొవైడర్ బీఎల్ఎస్ (BLS) ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ కేంద్రాలు ఆదివారంతో సహా వారానికి ఏడు రోజులు అందుబాటులో ఉంటాయి.

భారత 74వ గణతంత్ర దినోత్సవ వేడుకల (74th Republic Day Celebrations) సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి (Aman Puri) మాట్లాడుతూ.. "మీ శ్రేయస్సు, సంక్షేమం కోసం పని చేయడానికి మా నిబద్ధతను నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఈ క్రమంలో గత వారం నుండి పాస్‌పోర్ట్, వీసా సేవల కోసం అవుట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్ వారంలోని అన్ని రోజులూ పనిచేస్తోంది. అలాగే ఇకపై ఓపెన్-డోర్ విధానాన్ని నిర్వహిస్తాం. దీని ద్వారా భారతీయ జాతీయుడు అపాయింట్‌మెంట్ లేదా ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ఏదైనా విషయానికి సంబంధించి తమ ఫిర్యాదును నమోదు చేసుకోవడానికి కాన్సులేట్‌ను సందర్శించవచ్చు." అని అన్నారు.

భారతీయ ప్రవాసుల అభ్యర్థన మేరకు వారి డిమాండ్‌ను తీర్చడానికి జనవరి 22 నుండి అన్ని రోజులలో పాస్‌పోర్ట్, వీసా సేవల కోసం దరఖాస్తు సమర్పించడానికి దుబాయ్ (Dubai), షార్జాలో (Sharjah) ఉన్న మూడు కేంద్రాలను తెరవాలని నిర్ణయించారు. కాగా, ఆదివారాల్లో దరఖాస్తుదారులు తత్కాల్, అత్యవసర కేసులు (వైద్య చికిత్స, మరణం) మినహా అపాయింట్‌మెంట్ ప్రాతిపదికన ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తును అవసరమైన సహాయక పత్రాలతో పాటు సమర్పించవచ్చు. దీనికోసం దరఖాస్తుదారులు https://blsindiavisa-uae.com/appointmentbls/appointment.php లింక్‌ని ఉపయోగించి బీఎల్ఎస్ కేంద్రాలతో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూఏఈ ప్రభుత్వ సీనియర్ అధికారులు, భారతదేశ స్నేహితులు, దౌత్య దళ సభ్యులు, దేశంలోని వ్యాపార సంఘం, ఇతర రంగాలకు చెందిన ప్రముఖ ప్రతినిథులకు అమన్ పూరి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-01-28T09:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising