ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎవరీ జశ్వంత్ సింగ్..? 21 ఏళ్ల ఈ భారతీయ కుర్రాడిని బ్రిటన్ సర్కారు ఎందుకు శిక్షిస్తోందంటే..

ABN, First Publish Date - 2023-02-04T20:26:48+05:30

బిట్రన్‌లో రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న భారత సంతతి యువకుడు జస్వంత్ సింగ్ చైల్‌ తాను నేరం చేసినట్టు అంగీకరించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బిట్రన్‌లో రాజద్రోహం కేసు(Treason) ఎదుర్కొంటున్న భారత సంతతి యువకుడు జస్వంత్ సింగ్ చైల్(Jaswant singh chail) తాను నేరం చేసినట్టు అంగీకరించాడు. మూడేళ్ల నాటి ఘటనలో తాను రాజద్రోహానికి పాల్పడినట్టు కోర్టులో ఒప్పుకున్నాడు. 2021లో క్రిస్మస్ సందర్భంగా జస్వంత్ సింగ్ విల్లు, బాణంతో విండ్సార్ కోటలోకి(Windsor Castle) వెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న సిబ్బంది అతడిని అడ్డుకోగా.. రాణి ఎలిజబెత్‌ను చంపేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో.. వాళ్లు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఆ తరువాత అతడిని ఇంగ్లండ్‌‌లోని బ్రాడ్‌మూర్ మానసిక చికిత్స ఆస్పత్రికి తరలించారు.

ఇటీవల అతడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరై నేరం చేసినట్టు అంగీకరించాడు. ట్రీసన్ యాక్ట్ 1842(Treason Act 1842) కింద రాజద్రోహానికి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. బ్రిటన్‌లో ఈ చట్టం కింద 1981 తరువాత ఓ వ్యక్తి నిందితుడిగా తేలడం ఇదే తొలిసారి. సుమారు రెండు దశాబ్దాల క్రితం ఓ వ్యక్తి అప్పటి రాణి విక్టోరియాపై తుపాకీ గురిపెట్టిన ఘటన తరువాత ట్రీసన్ యాక్ట్ 1842ను తెచ్చారు. కాగా.. నిందితుడు జస్వంత్ గతంలో.. రక్షణ శాఖ పోలీసు విభాగం, గ్రెనేడియర్ గార్డ్స్ విభాగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు కోర్టులో పేర్కొన్నారు. ‘‘రాణిని చంపేందుకే ఇక్కడకు వచ్చా’’ అని కోట వద్ద కాపలా అధికారులతో జస్వంత్ అన్నట్టు కోర్టుకు నివేదించారు. ఇక స్థానిక మీడియా కథనాల ప్రకారం.. 1919 నాటి జలియన్‌వాలా బాగ్ ఘటనలో మరణించిన భారతీయుల తరఫున ప్రతీకారం తీర్చుకునేందుకే అతడు రాణిని చంపాలని నిర్ణయించుకున్నాడట. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై జనరల్ డయ్యర్ కాల్పులకు ఆదేశించడంటో పెద్ద సంఖ్యలో భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక గతేడాది సెప్టెంబర్ 8న రాణి ఎలిజబెత్ మృతిచెందారు.

Updated Date - 2023-02-04T20:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising