ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: 30వేల మంది విదేశీయులను వెళ్లగొట్టిన కువైత్.. అత్యధికులు భారతీయులే..!

ABN, First Publish Date - 2023-01-03T08:54:50+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా వలసదారుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా వలసదారుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులపై ఉక్కుపాదం మోపుతోంది. వరసు తనిఖీలతో విదేశీయులకు చుక్కలు చూపిస్తోంది. రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలితే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఈ నేపథ్యంలో గతేడాది ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) ఏకంగా 30వేల మంది విదేశీయులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 660 న్యాయపరమైన బహిష్కరణలు (Deportation) కాగా, మిగిలినవి అడ్మినిస్ట్రేటివ్ బహిష్కరణలు.

అలాగే దేశం నుంచి వెళ్లగొట్టిన 30వేల మందిలో 17వేల మంది పురుషులు ఉంటే.. 13వేల మంది మహిళలు ఉన్నారు. ఇక దేశాలవారీగా చూసుకుంటే.. అత్యధికులు భారతీయ ప్రవాసులే (Indian Expats) ఉన్నారు. 8,100 మందితో మనం ఈ బహిష్కరణ జాబితాలో టాప్‌లో ఉన్నాం. ఇందులో 6400 మంది పురుషుల, 1700 మంది మహిళలు ఉన్నారు. మన తర్వాత వరుసగా బంగ్లాదేశ్(3,500), ఈజిప్ట్(3,000), ఫిలిప్పీన్స్(3,000), శ్రీలంక(2,600), ఇథియోపియా(1,400) ఉన్నాయి.

Updated Date - 2023-01-03T09:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising