ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwaitization: కువైత్ యూనివర్శిటీ సంచలన నిర్ణయం.. నాలుగేళ్ల పాటు..

ABN, First Publish Date - 2023-01-15T10:04:31+05:30

దేశంలో రోజురోజుకు అన్ని రంగాలలో అంతకంతకు పెరిగిపోతున్న వలసదారుల (Expats) ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ప్రాధాన్యం కలిగించే ఉద్దేశంతో 2017లో కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) తీసుకొచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: దేశంలో రోజురోజుకు అన్ని రంగాలలో అంతకంతకు పెరిగిపోతున్న వలసదారుల (Expats) ప్రాబల్యాన్ని తగ్గించి స్థానికులకు ప్రాధాన్యం కలిగించే ఉద్దేశంతో 2017లో కువైత్ సర్కార్ కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) తీసుకొచ్చింది. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన అన్ని సంస్థలలో దీన్ని ఇంప్లీమెంట్ చేసేందుకు ఆ దేశ సివిల్ సర్వీస్ విభాగం ఐదేళ్ల గడువు ఇచ్చింది. 2022తో ఈ గడువు ముగిసింది. దాంతో ప్రస్తుతం ఆ దేశంలో ఈ పాలసీని చాలా కఠినంగా అమలు చేస్తున్నారు. దాంతో గడిచిన రెండేళ్ల నుంచి ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి వేలాది మంది ప్రవాసులు స్వదేశాలకు తరలిపోయారు.

ఇదిలాఉంటే.. కువైత్ యూనివర్శిటీ (Kuwait University) కువైటైజేషన్ పాలసీని అమలు చేసే విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు సంవత్సరాల పాటు కువైటీకరణను (Kuwaitization) సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైత్ యూనివర్శిటీ తాత్కాలిక డైరెక్టర్ డా. సుయాద్ అల్-ఫద్లీ, తాత్కాలిక సెక్రటరీ జనరల్ డా. ఫయేజ్ అల్-దాఫిరి, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ సెక్రటరీలకు ఈ నిర్ణయం తాలూకు కాపీని తమ వద్ద ఉంచుకోవాలని యూనివర్సిటీ కౌన్సిల్ ఆదేశించింది. కాగా, యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో విద్యానభ్యసించే విదేశీ విద్యార్థులకు (Foreign Students) మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-01-15T10:04:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising