ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: ఎన్నారై యూసఫ్ అలీ ఉదారత.. రూ. 22.39కోట్ల భారీ విరాళం..!

ABN, First Publish Date - 2023-03-29T10:11:33+05:30

లూలూ గ్రూపు చైర్మన్, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన ఉదారత చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దుబాయి: లూలూ గ్రూపు చైర్మన్, ఎన్నారై ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన ఉదారత చాటుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం (Ramdan Month) సందర్భంగా యూఏఈలో నిర్వహిస్తున్న 'వన్ బిలియన్ మీల్స్' అనే ప్రచార కార్యక్రమానికి 1కోటి దిర్హమ్స్ విరాళం ప్రకటించారు. మన కరెన్సీలో అక్షరాల రూ. 22.39కోట్లు అన్నమాట. కాగా, ప్రపంచంలోనే అతిపెద్ద రంజాన్ స్థిరమైన ఆహార సహాయ నిధిని ప్రారంభించాలనే లక్ష్యంతో యూఏఈ (UAE) ఈ 'వన్ బిలియన్ మీల్స్' ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ సందర్భంగా యూసఫ్ అలీ మాట్లాడుతూ.. ఎండోమెంట్ క్యాంపెయిన్‌కు విరాళం ఇవ్వడం అనేది దాతృత్వానికి ప్రపంచ కేంద్రంగా యూఏఈ స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి తన నిబద్ధతగా పేర్కొన్నారు. మానవతావాద పనుల్లో యూఏఈ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. అలాగే 'వన్ బిలియన్ మీల్స్' (One Billion Meals) సహాయ నిధి కార్యక్రమానికి సహకరించడం ద్వారా పేదలకు సహాయం చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక ప్రపంచంలోని పేదలకు సహాయం చేయడానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ ప్రచారాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో దీనికి భారీ మొత్తం విరాళాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: మనీలాలో ఘోరం.. ఎన్నారై దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి చోరబడి మరి కాల్చిచంపిన దుండగుడు!

Updated Date - 2023-03-29T10:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising