ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NRIs: భారత పర్యాటకులకు తీపి కబురు.. వీసా ఫ్రీ ఎంట్రీకి మరో దేశం గ్రీన్ సిగ్నల్..!

ABN, First Publish Date - 2023-11-28T07:08:17+05:30

భారత టూరిస్టులకు (Indian tourists) మలేసియా తీపి కబురు చెప్పింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో వియత్నం, థాయ్‌లాండ్, శ్రీలంక బాటలోనే మలేసియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎన్నారై డెస్క్: భారత టూరిస్టులకు (Indian tourists) మలేసియా తీపి కబురు చెప్పింది. పర్యాటక రంగానికి ఊతమిచ్చే ఉద్దేశంతో వియత్నం, థాయ్‌లాండ్, శ్రీలంక బాటలోనే మలేసియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ (visa-free entry) కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రాహీం తెలిపారు. కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని (Tourism Sector) తిరిగి గాడితో పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారత్, చైనా నుంచే అధిక సంఖ్యలో పర్యాటకులు తమ దేశానికి వస్తుంటారని, అందుకే భారత పౌరులకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇకపై భారతీయులు (Indians) ఎలాంటి వీసా అవసరం లేకుండా తమ దేశంలో 30 రోజుల వరకు స్టే చేయొచ్చని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. మలేసియా (Malaysia) తాజా నిర్ణయం పట్ల భారత సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kuwait: 226 మంది ప్రవాసులు అరెస్ట్.. అసలు కువైత్‌లో ఏం జరుగుతోంది..!


ఇదిలాఉంటే.. ఇంతకుముందే వియత్నం కూడా భారత్‌తో పాటు చైనా పర్యాటకులకు వీసా అవసరం లేని ప్రయాణానికి అనుమతి ఇచ్చింది. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడెన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, ఫిన్లాండ్ దేశస్థులకు సైతం వియత్నం వీసా ఫ్రీ ఎంట్రీకి వీలు కల్పించింది. ఇక ఇతర దేశాల వారికి 90 రోజుల వ్యవధితో 'ఇ-వీసా' (e-visas) లను అందిస్తోంది. అలాగే ఆయా దేశాల వారికి 'ఇ-వీసా' ల ద్వారా మల్టీపుల్ ఎంట్రీలకు కూడా అవకాశం కల్పించింది. వియత్నం మాదిరిగానే థాయ్‌లాండ్ కూడా భారత్, తైవాన్ పర్యాటకులకు నవంబర్ 10వ తేదీ నుంచి వీసా ఫ్రీ ఎంట్రీకి వీలు కల్పించింది. 2024 మే 10వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. థాయ్‌లాండ్‌కు భారత్ నుంచి భారీ మొత్తంలో ప్రయాణీకులు వస్తుంటారని, అందుకే వీసా అవసరంలేని ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు థాయ్ ప్రధాని స్రెట్టా థావిజన్ (Prime Minister Srettha Thavision) తెలిపారు.

Saudi Arabia: డొమెస్టిక్ వర్క్ వీసాకు కొత్త కండిషన్ పెట్టిన సౌదీ.. ఇకపై..


అటు పొరుగు దేశం శ్రీలంక కూడా ఇండియన్లకు ఉచిత వీసాలను అందిస్తోంది. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31 వరకు ఇలా భారతీయులు శ్రీలంకను వీసా ఫ్రీ ఎంట్రీ ద్వారా సందర్శించే వెసులుబాటు ఉంది. భారత్‌తో పాటు చైనా రష్యా, మలేసియా, జపాన్; ఇండోనేషియా, థాయ్‌లాండ్ పౌరులకు కూడా ఈ అవకాశం కల్పించింది.

Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?

Updated Date - 2023-11-28T07:27:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising