Kuwaitization Policy: తగ్గేదేలే అంటున్న కువైత్.. 1,815 మంది ప్రవాస టీచర్లకు ఉద్వాసన..!
ABN, First Publish Date - 2023-03-16T08:37:02+05:30
వలసదారుల (Expatriates) ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయని భావించిన కువైత్ (Kuwait).. 2017లో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) ప్రకటించింది.
కువైత్ సిటీ: వలసదారుల (Expatriates) ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు కరువవుతున్నాయని భావించిన కువైత్ (Kuwait).. 2017లో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో భారీ సంఖ్యలో ప్రవాస ఉద్యోగులను తొలిగించడం చేస్తోంది. వారి స్థానంలో కువైటీలను (Kuwaitis) నియమిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (Ministry of Education) కీలక ప్రకటన చేసింది. 1,815 మంది ప్రవాస టీచర్లకు ఉద్వాసన పలికింది.
అలాగే మరో 209 మంది ప్రవాస విభాగాధిపతులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ప్రాసెస్ పూర్తి చేస్తామని, కువైటైజేషన్ పాలసీలో భాగంగానే ఈ తొలగింపులు చేస్తున్నట్లు మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అహ్మద్ అల్-వాహీదా (Ahmed Al-Wahida) వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి, ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధనల మంత్రి (Minister of Education and Minister of Higher Education and Scientific Research) డాక్టర్ హమద్ అల్-అద్వానీ (Dr. Hamad Al-Adwani) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: 'ఆ వ్యవధిలో కొత్త పని వెతుక్కోవడం కష్టం.. దానివల్ల ప్రతిభావంతుల్ని కోల్పోతున్నాం'
Updated Date - 2023-03-16T08:37:02+05:30 IST