Oman: వారం రోజుల్లో 245 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన ఒమాన్.. కారణమిదే..!
ABN, First Publish Date - 2023-05-30T08:47:21+05:30
గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రవాసులు ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.
మస్కట్: గల్ఫ్ దేశాల్లో కార్మిక చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రవాసులు ఏమాత్రం ఆలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక ఇటీవల వలసదారుల ప్రాబల్యం అంతకంతకు పెరిగిపోతుడడంతో జీసీసీ దేశాలు (GCC Coutries) అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కువైత్ (Kuwait) ప్రవాస కార్మికుల విషయంలో కఠిన నిబంధనలు, పాలసీలను అమలు చేస్తోంది. వలసదారులు చట్టాలను ఉల్లంఘించినట్లు తేలితే వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఇప్పుడు కువైత్ బాటలో ఒమాన్ (Oman) పయనిస్తోంది. గతవారం రోజుల వ్యవధిలోనే ఏకంగా 245 మంది ప్రవాస కార్మికులను దేశం నుంచి వెళ్లగొట్టింది (Deported). వీరంతా కూడా ఒమాన్ కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు (Violating Oman Labour Law) కార్మిశాఖ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో కార్మికశాఖ తనిఖీల్లో మరో 170 మంది వలసదారులు సరియైన ధృవపత్రాలు లేకుండా పట్టుబడ్డారు. వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన మొత్తం కార్మికుల్లో 81 మంది పరారీలో ఉన్నవారిగా కార్మికశాఖ అధికారులు గుర్తించారు.
Updated Date - 2023-05-30T08:47:21+05:30 IST