Mississippi Tornado: అగ్రరాజ్యం అమెరికాలో మరో ప్రకృతి విపత్తు.. 23 మంది మృతి!
ABN, First Publish Date - 2023-03-26T07:25:30+05:30
రాకాసి సుడిగాలి(టోర్నడో) అమెరికాలోని మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది.
23 మందిని బలిగొన్న టోర్నడో
అమెరికాలోని మిసిసిప్పీ, అలబామాలో ఘటన
వాషింగ్టన్, మార్చి 25: రాకాసి సుడిగాలి(టోర్నడో) అమెరికాలోని మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి ప్రారంభమైన ఈ టోర్నడో ప్రభావం రెండు రాష్ట్రాల్లోనూ 100 కిలోమీటర్ల దాకా కనిపించిందని అమెరికా జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ టోర్నడో గంటకు 112 కిలోమీటర్ల వేగంతో సిల్వర్‌సిటీ, రోలింగ్ ఫోర్క్ నగరాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కడపటి వార్తలందేసరికి ఆయా ప్రాంతాల్లో 23 మంది మృతిచెందారని, డజన్ల కొద్దీ ప్రజల ఆచూకీ గల్లంతైందని అధికారులు వెల్లడించారు. రాకాసి సుడిగాలి ఏమాత్రం బలహీనపడడం లేదని, అలబామాలోని వినోనా, అమోరి నగరాలతోపాటు.. పలు ప్రాంతాలకు ఇంకా ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.
Updated Date - 2023-03-26T07:25:30+05:30 IST