ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kuwait: మరో సంచలన నిర్ణయం దిశగా కువైత్.. ఆ వర్కర్ల తొలగింపునకు కసరత్తు..

ABN, First Publish Date - 2023-01-09T11:25:24+05:30

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రవాస కార్మికుల (Expat Workers) పట్ల పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా నైపుణ్యం లేని (Unskilled) ప్రవాస కార్మికుల సంఖ్యను తగ్గించాలని యోచిస్తుందట. అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) ఇప్పటికే చర్యలు మొదలుపెట్టిందని సమాచారం. దీనిలో భాగంగా అవసరమైన వారికి తప్ప ఈ ఏడాది మరేవరికీ అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లేబర్ మార్కెట్‌కు అవసరం లేనిపక్షంలో వర్క్ పర్మిట్లు (Work Permits) రెన్యువల్ చేయబడవని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ పేర్కొంది.

అలాగే విదేశీ వర్కర్లను (Foreign Workers) తీసుకువచ్చే వ్యాపారులపై నిర్ణీత ఫీజు విధించాలనే యోచనలో కువైత్ సర్కార్ (Kuwait Govt) ఉందట. ఇక ఇఖామా (రెసిడెన్సీ పర్మిషన్) ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా వర్క్ పర్మిట్లను పొందిన వారిని పట్టుకోవడంతో పాటు బహిష్కృత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని గుర్తించడం తదితర కార్యక్రమాలను నిర్వహించేందుకు ముసాయిదా చట్టాన్ని జాతీయ అసెంబ్లీకి పంపించనున్నట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఇదిలాఉంటే.. గతంలో వలసదారుల (Expats) ఇఖామాల విషయమై అంతర్గత మంత్రిత్వశాఖ పలుమార్లు ఎంపీలతో చర్చలు జరిపింది. ఇప్పుడు ఈ విషయమై ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది.

Updated Date - 2023-01-09T11:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising