ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

UK: విదేశీ విద్యార్థులను ఆకర్షించే దిశగా బ్రిటన్ కీలక నిర్ణయం..!

ABN, First Publish Date - 2023-02-19T12:00:06+05:30

విదేశీ విద్యార్థులను (Overseas Students) ఆకర్షించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం (Britain Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: విదేశీ విద్యార్థులను (Overseas Students) ఆకర్షించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం (Britain Government) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కు (International Students) మరింత వేగంగా వీసాలను (Visas) జారీ చేసేందుకు విధివిధాలను రూపొందించేలా నిపుణులతో కూడిన ప్రత్యేక ప్యానెల్‌ను (New Expert Panel) నియమించింది. దీనిలో ఇమ్మిగ్రేషన్, విద్యారంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్యానెల్‌లో భారత సంతతికి (Indian Origin) చెందిన పలువురికి కూడా చోటు దక్కడం విశేషం. బ్రిటన్ విశ్వవిద్యాలయాల శాఖ మాజీ మంత్రి, ఎంపీ క్రిస్ స్మిడ్మోర్ అధ్యక్షతన ఈ ప్యానెల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. రిషి సునాక్ సర్కార్ పోస్ట్ స్టడీ వర్క్ వీసా మార్గాన్ని, ఇతర చర్యలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఇటీవల పలు గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆ దేశ సమాజానికి విదేశీ విద్యార్థుల విలువను హైలైట్ చేయడం, ఇతర వీసా ఆఫర్‌లతో (Visa Offers) కూడిన అంతర్జాతీయ విద్యా వ్యూహం 2.0 కోసం సిఫార్సులు చేయడం ఈ కమీషన్ ముఖ్య విధి. ఇక ఇదే ప్యానెల్‌లో మంత్రులు లార్డ్‌ జో జాన్సన్, లార్డ్ డేవిడ్ విల్లెట్లస్, ప్రముఖ విద్యావేత్తలైన ప్రొఫెసర్ షితీజ్ కపూర్‌లు కూడా సభ్యులుగా ఉన్నారు. అలాగే భారత సంతతికి చెందిన సనమ్ అరోరా ఈ ప్యానెల్‌లో కమీషనర్‌గా నియమితులయ్యారు. ఈయన నేషనల్ ఇండియన్ స్టూడెంట్స్ అండ్ అలుమ్ని యూనియన్ (NISAU) వ్యవస్థాపకుడు. ఈ సందర్భంగా అరోరా మాట్లాడుతూ.. భారత్, బ్రిటన్‌లకు సంబంధించినంత వరకు తాము కీలక తరుణంలో ఉన్నామన్నారు. మెరుగైన ఇమ్మిగ్రేషన్ విధానాలతో యూకేలో చదువుతున్న భారతీయ గ్రాడ్యుయేట్లకు వారి ప్రతిభకు సరిపోయే అవకాశాలను సృష్టించవచ్చని అరోరా అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి: దుబాయిలో 3నెలల కింద కనిపించకుండా పోయిన భారత యువకుడు.. చివరికి..

ఇదిలాఉంటే.. ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) గణాంకాల ప్రకారం విదేశీ విద్యార్థుల జాబితాలో భారతీయులు గతేడాది చైనాను అధిగమించి అగ్రస్థానంలో నిలిచారు. 2021 జూలైలో ప్రవేశపెట్టిన కొత్త గ్రాడ్యుయేట్ వీసా రూట్ విధానం ప్రకారం.. పోస్ట్ స్టడీకి రెండేళ్ల వరకు అనుమతించింది. ఇందులోనూ 41శాతం వీసాలతో భారతీయులు ఆధిపత్యం కనబరుస్తున్నారు. అయితే, యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ మాత్రం పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్‌ను పరిమితం చేసేందుకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు అక్కడి మీడియా పేర్కొంటోంది.

ఇది కూడా చదవండి: అమ్మ బాబోయ్.. ఇలాంటి కూతుళ్లున్న తండ్రుల పని ఔటే.. తల్లి వద్ద తండ్రిని ఎలా ఇరికించేసేందో చూడండి..!

Updated Date - 2023-02-19T12:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising