UAE travel: యూఏఈ నివాసితులకు షాకింగ్ న్యూస్!
ABN, First Publish Date - 2023-06-17T12:31:29+05:30
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నుంచి అమెరికా వెళ్లాలనుకునే నివాసితులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నుంచి అమెరికా వెళ్లాలనుకునే నివాసితులకు ఇది నిజంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే 2024 అక్టోబర్ వరకు యూఎస్ వీసా అపాయింట్‌మెంట్స్ (US Visa Appointments) అందుబాటులో లేవట. దాంతో యూఎస్ వెళ్లాలనుకునే నివాసితులు వచ్చే ఏడాది అక్టోబర్ వరకు నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. అలాగే బీ1, బీ2 విజిట్ వీసాల కోసం కూడా 2024 సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందేనని ట్రావెల్ ఏజెన్సీలు (Travenl Agencies) చెబుతున్నాయి. కరోనా తర్వాత వీసా దరఖాస్తుల (Visa Applications) సంఖ్య ఒక్కసారిగా పెరగడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని రిజాయిస్ ట్రావెల్ అండ్ టూరిజం జనరల్ మేనేజర్ థాస్ ఆంథోనీ తెలిపారు.
ఇక అమెరికా విజిట్ వీసాలలో వ్యాపార ప్రయోజనాల కోసం వెళ్లేందుకు బిజినెస్ వీసా (Business Visa) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీసానే 'బీ1 వీసా' అని కూడా అంటారు. అలాగే సందర్శన కోసం టూరిస్ట్ వీసాకు (Tourist Visa) ఆప్లై చేసుకోవాలి. అదే 'బీ2 వీసా అన్నమాట. ఇక విజిటింగ్ వీసా (Visiting Visa) అనేది ఒక వ్యక్తి అగ్రరాజ్యంలోకి ప్రవేశించడానికి, అలాగే అక్కడ 6నెలల పాటు బస చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వీసాను 'డీఎస్-160' ఆన్‌లైన్ ఫారంను పూర్తి చేయడం ద్వారా పొందవచ్చని థాస్ ఆంథోనీ చెప్పారు. కాగా, యూఎస్ వీసా అపాయింట్‌మెంట్స్ కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి రావడం పట్ల యూఏఈ నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
The Marble Palace: దుబాయిలో అమ్మకానికి రూ.1,600కోట్ల భవంతి.. కొనుగోలు చేసే యోచనలో భారతీయుడు!
Updated Date - 2023-06-17T12:31:29+05:30 IST