ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oman: 11 మంది ప్రవాసుల అరెస్ట్.. మస్కట్ అధికారులు ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-05-21T12:47:26+05:30

ఒమాన్ రాజధాని మస్కట్‌లో (Muscat) తాజాగా 11 మంది ప్రవాసులను అక్కడి కార్మిక మంత్రిత్వశాఖ (Ministry of Labour) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్‌లో (Muscat) తాజాగా 11 మంది ప్రవాసులను అక్కడి కార్మిక మంత్రిత్వశాఖ (Ministry of Labour) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రాయల్ ఒమాన్ పోలీసులకు అప్పగించారు. మస్కట్ గవర్నరేట్ పరిధిలో కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడినందుకే వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక మంత్రిత్వశాఖ, రాయల్ ఒమాన్ పోలీసులు (Royal Oman Police) సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ఇలా ప్రవాసులు పట్టుబడ్డారు. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. ఇక అధికారులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. కార్మిక, రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఈ సందర్భంగా సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. నివాసితులు, వలసదారులందరూ (Expatriates) సుల్తానేట్ చట్టాలకు లోబడి ఉండాల్సిందిగా తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

WhatsApp: ఎల్లలు దాటిన వాట్సాప్ సందేశం.. ఆఫ్రికాలో ఉన్న తండ్రికి తెలుగునాట తప్పిపోయిన బిడ్డ ఆచూకీ తెలిసిందిలా..

Updated Date - 2023-05-21T12:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising