Labour Laws: ఒమాన్‌లో 60 మందికిపైగా ప్రవాస కార్మికులు అరెస్ట్.. నెల రోజుల్లోనే 480 మంది దేశ బహిష్కరణ!
ABN, First Publish Date - 2023-05-12T14:01:41+05:30
గల్ఫ్ దేశం ఒమాన్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాస కార్మికులపై ఉక్కుపాదం మోపుతోంది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాస కార్మికులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కార్మిక చట్టాలను (Labour Laws) ఉల్లంఘించిన 60 మందికిపైగా ప్రవాస కార్మికులను అదుపులోకి తీసుకున్నట్లు కార్మిక మంత్రిత్వశాఖ (Ministry of Labour) వెల్లడించింది. ఈ విషయమై మంత్రిత్వశాఖ ఆన్‌లైన్ వేదికగా కీలక ప్రకటన చేసింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ లేబర్ వెల్ఫేర్, సీబ్ మున్సిపాలిటీ, రాయల్ ఒమాన్ పోలీస్ (Royal Oman Police) సహకారంతో సీబ్ విలాయత్‌లో తనిఖీ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా చట్టాలను ఉల్లంఘించిన 42 మంది కార్మికులను అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, 32 మంది కార్మికులను బహిష్కరించినట్లు పేర్కొంది. అంతకుముందు ధోఫర్ గవర్నరేట్ పరిధిలో సంయుక్త తనిఖీ బృందం సోదా ప్రచారాలను నిర్వహించింది. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 27 మంది కార్మికులను అరెస్ట్ (Arrest) చేశారు.
ఏప్రిల్ 2023లో ఒమన్‌లో 480 మంది ప్రవాస కార్మికులను బహిష్కరించారు. మస్కట్ గవర్నరేట్‌లో జరిగిన తనిఖీ క్యాంపెయిన్ ఫలితంగా 142 మంది నాన్-ఒమనీ కార్మికులను (Non-Omani Workers) అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నాన్-ఓనర్ల వద్ద పని చేస్తున్న 48 మంది వర్కర్లు, 83 మంది స్వయం ఉపాధి కార్మికులు, ఒమనైజ్డ్ వృత్తులలో పనిచేస్తున్న 10 మంది వర్కర్లు ఉన్నారు. ఇక ఏప్రిల్ మాసంలో వివిధ ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 485 మందిని సుల్తానేట్ నుంచి బహిష్కరించినట్లు మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.
Richest Royal Family of World: ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిదో తెలుసా..? బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ మాత్రం కాదండోయ్..!
Updated Date - 2023-05-12T14:01:41+05:30 IST