ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai flights: గతేడాది దుబాయికి ప్రయాణించిన వారిలో మనోళ్లే టాప్.. ఎంతమంది ప్రయాణించారంటే..

ABN, First Publish Date - 2023-02-22T08:41:51+05:30

ప్రయాణీకుల రాకపోకల విషయమై గతేడాదిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (DXB) ఇండియా టాప్ డెస్టినేషన్‌గా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: ప్రయాణీకుల రాకపోకల విషయమై గతేడాదిలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (DXB) ఇండియా టాప్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఈ మేరకు మంగళవారం దుబాయ్ ఎయిర్‌పోర్టు (Dubai Airport) విడుదల చేసిన వార్షిక గణాంకాల ద్వారా తెలిసింది. ఈ గణాంకాల ప్రకారం... 2022లో భారత్ (India) నుంచి 9.8 మిలియన్ల మంది ప్రయాణికులు దుబాయికి (Dubai) ప్రయాణించారు. ప్రపంచంలోని ఏ ఇతర గమ్యస్థానం నుంచి అయినా ఇదే అత్యధికం. భారత్ తర్వాత సౌదీ అరేబియా(49లక్షలు), బ్రిటన్ (46లక్షలు), పాకిస్థాన్ (37లక్షలు), యూఎస్ (30లక్షలు), రష్యా (19లక్షలు), టర్కీ (16లక్షలు) ఉన్నాయి.

ఇక ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా పేరుగాంచిన దుబాయ్ ఎయిర్‌పోర్టు ప్రస్తుతం 99 దేశాల్లోని 229 డెస్టినేషన్స్‌కు 88 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడుపుతోంది. దుబాయి ఎకానమీ, పర్యాటక శాఖ ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. గతేడాది మొత్తం 14.36 మిలియన్ల మంది పర్యాటకులు (Tourists) దుబాయిని సందర్శించారు. 2021తో పోల్చితే ఇది 97 శాతం అధికం. 2021లో భారత్ నుంచి 18.4లక్షల మంది, సౌదీ నుంచి 12.10లక్షల మంది, బ్రిటన్ నుంచి 10లక్షల మంది, పాకిస్థాన్ నుంచి 3.56లక్షల మంది దుబాయిని విజిట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

ఇక నగరాల పరంగా చూసుకుంటే 2022లో దుబాయి ఎయిర్‌పోర్టు ద్వారా లండన్ నుంచి అత్యధికంగా రాకపోకలు కొనసాగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో రియాద్ (20 లక్షలు), ముంబై (19లక్షలు), జెడ్డా (17లక్షలు), న్యూఢిల్లీ (17లక్షలు) ఉన్నాయి. 2023 జనవరిలో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంకు దుబాయి అగ్ర గమ్యస్థానంగా ఉందని భారత విమానాశ్రయం తన నెలవారీ డేటాలో పేర్కొంది. మొత్తంగా 2022లో డీఎక్స్‌బీ ప్యాసింటర్ ట్రాఫిక్ రెండింతలు పెరిగి 66 మిలియన్లకు పైగా పెరుగుదల నమోదు చేసింది. ఈ నేపథ్యంలో 2023లో ప్రయాణికుల అంచనాను 78 మిలయన్లకు పెంచింది.

ఇది కూడా చదవండి: సినిమాటిక్ సీన్.. ఈమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే భయ్యా.. వైరల్ వీడియో!

ఇదిలాఉంటే.. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ ఇప్పటికే పలు వీసాలను తీసుకొచ్చింది. 2022 సెప్టెంబర్‌లో 60 రోజుల టూరిస్ట్ వీసా, బహూళజాతి కంపెనీల ఉద్యోగులకు 5ఏళ్ల మల్టీ-ఎంట్రీ వీసా, 10 ఏళ్ల పరిమితితో గోల్డెన్ వీసా పథకం, వర్చువల్ వర్క్ కోసం అనుమతులు ఇలా పలు రకాల వీసా పథకాలతో సందర్శకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులను ఆకర్షిస్తున్నాయి.

Updated Date - 2023-02-22T08:44:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising