ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Rice: యూఏఈలోనూ యూఎస్ సీన్ రిపీట్.. భారీగా పెరిగిన బియ్యం ధరలు..

ABN, First Publish Date - 2023-07-26T11:39:59+05:30

ఆకాశాన్నంటుతున్న బియ్యం (Rice) ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత గురువారం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.

అబుదాబి: ఆకాశాన్నంటుతున్న బియ్యం (Rice) ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత గురువారం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో ఒక్కసారిగా బియ్యం ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఇక విదేశాల్లో ఉండే భారతీయులు బియ్యం కోసం ఒక్కసారిగా ఎగబడడంతో రైస్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా అక్కడి బియ్యం స్టోర్ యజమానులు ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీనికి గల్ఫ్ దేశాలు సైతం మినహాయింపు కాదు. ముఖ్యంగా భారతీయ ప్రవాసులు అధిక సంఖ్యలో ఉండే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో బియ్యం ధరలు 40 శాతం వరకు పెరిగినట్లు అక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

అయితే, ఇది తాత్కాలిక సమస్య అని, కొత్త సరఫరాదారులు మార్కెట్‌లోకి ప్రవేశిస్తే త్వరలో ధరలు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు. అటు వియత్నాం, థాయ్‌లాండ్, పాకిస్థాన్ దేశాలలో బియ్యం ఉత్పత్తి కొరతతో పాటు ఇటు ఇండియా (India) ఎగుమతిపై నిషేధం తర్వాత బాస్మతీయేతర బియ్యానికి యూఏఈలో బాగా డిమాండ్ ఏర్పడింది. కాగా, ఆ దేశానికి ఎగుమతి అయ్యే బియ్యంలో సింహాభాగం భారత్‌దే. ఇండియా నుంచి యూఏఈకి 40శాతానికి పైగా రైస్ భారత్ నుంచే ఎగుమతి అవుతుంది. గతేడాది మొత్తంగా 55.4 మిలియన్ మెట్రిక్ టన్నులు ఇండియా నుంచి దిగుమతి చేసుకుంది యూఏఈ (UAE).

UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్



ఇక యూఏఈలో బాస్మతీయేతర బియ్యం వాటా 45 శాతం అని, ఎక్కువగా దక్షిణ భారతీయులు వినియోగిస్తారని అల్ మాయా గ్రూప్ (Al Maya Group) డైరెక్టర్ కమల్ వచాని వెల్లడించారు. అలాగే అల్ ఆదిల్ ట్రేడింగ్ (Al Adil Trading) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ధనంజయ్ దాతర్ మాట్లాడుతూ.. స్థానిక మార్కెట్‌లో ధరలను అడ్డుకునేందుకు బియ్యం ఎగుమతులను నిషేధించాలని ఇండియా నిర్ణయం తీసుకోవడానికి ముందే యూఏఈలోకి అనేక రకాల బాస్మతీయేతర బియ్యం దిగుమతి అయ్యాయని తెలిపారు.

ఇదిలాఉంటే.. భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించిందన్న వార్తలతో అమెరికాలోని భారతీయులు బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు పోటీలు పడుతున్నారు. దీంతో సూపర్ మార్కెట్లలో రేట్లు భారీగా పెరిగిపోయాయి. అయినా మనోళ్లు వెనక్కి తగ్గడం లేదు. దాంతో స్టోర్ల యజమానులు ఒక కస్టమర్‌కి ఒక బ్యాగు మాత్రమే అంటూ బోర్డులు పెట్టేయడంతో ఎన్నారైలు ఇబ్బందులు పడుతున్నారు. యూఎస్‌లోనే కాదు ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.

Kuwait: మళ్లీ తెరపైకి జనాభా అసమతుల్యత.. ప్రవాసుల కోటాపై ఎంపీల కీలక ప్రతిపాదన..!

Updated Date - 2023-07-26T11:39:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising